Novak Djokovic | తొమ్మిదోసారి వింబుల్డన్ ఫైనల్లో జకోవిచ్.. ఫెదరర్ రికార్డు సమం చేసేనా..?
Novak Djokovic : సెర్జియా టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్(Novak Djokovic) తొమ్మిదోసారి వింబుల్డన్ ఫైనల్లో(Wimbledon final) అడుగుపెట్టాడు. దాంతో, అత్యధికంగా 35 సార్లు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్ చేరిన తొలి ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. అమెరికా లెజెండ్ క్రిస్ ఎవర్ట్(Chris Evert) నెలకొల్పిన రికార్డును...
Novak Djokovic : సెర్జియా టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్(Novak Djokovic) తొమ్మిదోసారి వింబుల్డన్ ఫైనల్లో(Wimbledon final) అడుగుపెట్టాడు. దాంతో, అత్యధికంగా 35 సార్లు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్ చేరిన తొలి ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. అమెరికా లెజెండ్ క్రిస్ ఎవర్ట్(Chris Evert) నెలకొల్పిన రికార్డును బద్ధలు కొట్టాడు. ఎవర్ట్ తన కెరీర్లో 34 గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్ ఆడాడు. సెమీఫైనల్లో 8వ సీడ్ జన్నిక్ సిన్నర్(Jannik Sinner)పై గెలుపొందాడు. హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో 6-3, 6-4, 7-6(7-4)తో సిన్నర్‌ను జకోవిచ్ చిత్తు చేశాడు.
ఫైనల్లో అతను కార్లోస్ అల్కరాజ్, డానిల్ మెద్వెదేవ్ మ్యాచ్ విజేతను ఢీ కొట్టనున్నాడు. టైటిల్ పోరులో జకోవిచ్ విజయం సాధిస్తే ఆస్ట్రేలియా దిగ్గజం మార్గరెట్ కోర్ట్(Margaret Court) ఆల్ టైమ్ 24 టైటిళ్ల రికార్డును సమం చేస్తాడు.
నొవాక్ జకోవిచ్, రోజర్ ఫెదరర్

ఫెదరర్ రికార్డుకు ట్రోఫీ దూరంలో..
ఈమధ్యే 23 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో జకోవిచ్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఫ్రెంచ్ ఓపెన్(French Open 2023) టైటిల్ నెగ్గిన జకోవిచ్ స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్(22)ను దాటేశాడు. అంతేకాదు ఈసారి వింబుల్డన్ విజేతగా నిలిస్తే మాజీ వరల్డ్ నంబర్ 1 రోజర్ ఫెదరర్(Roger Federer) రికార్డు సమం చేస్తాడు. ఫెదరర్ 8 సార్లు వింబుల్డన్ చాంపియన్‌గా నిలిచాడు. అతడి ఫీట్‌ను అందుకునేందుకు జకోవిచ్ ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఈ సెర్బియా స్టార్ మరింత దూకుడుగా ఆడుతున్నాడు. వరుస టోర్నీల్లో టైటిళ్లు కొల్లగొడుతూ రికార్డులు సృష్టిస్తున్నాడు.
ఇవి కూడా చదవండి
Ravindra Jadeja | రాక్‌స్టార్ రవీంద్ర జడేజా.. మైదానంలో జడ్డూ స్టైలిష్ లుక్స్ చూశారా..?
Team India – South Africa Tour | భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటన ఖరారు.. తొలి మ్యాచ్ ఎప్పుడంటే..?
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

