Novac Djokovic | టెన్నిస్‌లో కొత్త అధ్యాయం.. అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో జకోవిచ్ రికార్డు
Novac Djokovic : సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్(Novac Djokovic) సంచలనం సృష్టించాడు. టెన్నిస్ చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు(Grand Slam) గెలిచిన తొలి ఆటగాడిగా రికార్డు సాధించాడు. వరల్డ్ నంబర్ 3 జకోవిచ్ ఈరోజు ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ చాంపియన్‌గా అవతరించాడు. దాంతో, 23వ గ్రాండ్‌స్లామ్ ట్రోఫీని...
Novac Djokovic : సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్(Novac Djokovic) సంచలనం సృష్టించాడు. టెన్నిస్ చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు(Grand Slam) గెలిచిన తొలి ఆటగాడిగా రికార్డు సాధించాడు. వరల్డ్ నంబర్ 3 జకోవిచ్ ఈరోజు ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ చాంపియన్‌గా అవతరించాడు. దాంతో, 23వ గ్రాండ్‌స్లామ్ ట్రోఫీని ఖాతాలో వేసుకున్నాడు. మట్టి కోట రారాజు రఫెల్ నాదల్(Rafeal Nadal) 22 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల రికార్డు బ్రేక్ చేశాడు. ఇప్పటి వరకు 33 సార్లు గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు చేరిన జకోవిచ్ 23 సార్లు విజేతగా నిలిచాడు.
ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్(Australian Open) నెగ్గిన జకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగాడు. 23వ గ్రాండ్ స్లామ్‌పై కన్నేసిన అతను తొలి రౌండ్ నుంచి జైత్రయాత్ర కొనసాగించాడు. సెమీఫైనల్లో వరల్డ్ నంబర్ 1 కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz)కు షాకిచ్చాడు. హోరాహోరీగా జరిగిన ఫైనల్లో కాస్పర్ రూడ్()పై 7-6(7-1), 6-3, 7-5తో జకోవిచ్ గెలుపొందాడు.
నాదల్ అభినందన
తన రికార్డును బద్ధలు కొట్టిన అతడికి నాదల్ అభినందనలు తెలిపాడు. ‘కొన్నేళ్ల క్రితం 23 అనేది ఒక సంఖ్య మాత్రమే. ఆ మార్క్ అందుకోవడం అసాధ్యం అనిపించేది. కానీ, నువ్వు ఈ రోజు 23వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించావు’ అని నాదల్ తన సోషల్‌మీడియా పోస్ట్‌లో రాసుకొచ్చాడు. గత ఏడాది ఆటకు వీడ్కోలు పలికిన స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్(20) గ్రాండ్‌స్లామ్స్ ట్రోఫీలతో మూడో స్థానంలో ఉన్నాడు.
జకోవిచ్, నాదల్, ఫెదరర్

Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

