సుశీల్‌పై నాన్ బెయిలబుల్ వారంట్

న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్‌పై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ అయింది. జాతీయ జూనియర్ చాంపియన్ సాగర్ రాణా హత్యతో సంబంధముందన్న ఆరోపణలు వచ్చినప్పటి నుంచి పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్న సుశీల్‌పై ఢిల్లీలోని రోహిణి కోర్టు శనివారం వారంట్ ఇచ్చింది. ఈ నెల 4న ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో జరిగిన గొడవలో సాగర్ మృతి చెందాడు. సుశీల్‌తో పాటు మరికొందరు రెజ్లర్లు దాడి చేయడంతోనే సాగర్ మృతి చెందినట్టు ఆరోపణలు వచ్చాయి. అప్పటి నుంచి ఢిల్లీ పోలీసులు సుశీల్ కోసం గాలిస్తుండగా.. అతడు తప్పించుకొని తిరుగుతున్నాడు. మొత్తంగా సుశీల్‌పై హత్య, క్రిమినల్ కుట్ర, అపహరణ నేరాల కింద ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు కాగా.. పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. అలాగే సుశీల్‌ను పట్టించిన వారికి నగదు ప్రోత్సాహకం ఇస్తామని ప్రకటించాలనే యోచనలోనూ ఢిల్లీ పోలీసులు ఉన్నట్టు సమాచారం. అయితే హరిద్వార్‌లోని ఓ యోగా ఆశ్రమంలో సుశీల్ ఉన్నాడన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

