Virat Kohli | కోహ్లీ సెలక్షన్ విషయంలో ఆయనకు ఏం పని..? జై షాపై 1983 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ మెంబర్ ఫైర్
Virat Kohli | జూన్‌లో అమెరికా/వెస్టిండీస్ వేదికగా జరగాల్సి ఉన్న టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని పక్కనబెట్టాలని భావిస్తున్నట్టు వస్తున్న వార్తలపై భారత మాజీ క్రికెటర్, 1983లో వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న కృతి ఆజాద్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Virat Kohli | ఈ ఏడాది జూన్‌లో అమెరికా/వెస్టిండీస్ వేదికగా జరగాల్సి ఉన్న టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని పక్కనబెట్టాలని భావిస్తున్నట్టు వస్తున్న వార్తలపై భారత మాజీ క్రికెటర్, 1983లో వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న కృతి ఆజాద్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కోహ్లీని టీమ్ నుంచి తప్పించడానికి జై షాకు ఏం హక్కు ఉన్నదని..? అతడేమైనా సెలక్షన్ కమిటీలో సభ్యుడా..? అని నిలదీశాడు. జై షా ను ఉద్దేశిస్తూ ‘అవివేకి’ అని కామెంట్ చేశాడు.
ఆజాద్ ట్విటర్ (ఎక్స్) వేదికగా స్పందిస్తూ… ‘జై షా ఎందుకు..? అతడేమైనా సెలక్టరా..? కోహ్లీని వరల్డ్ కప్ టీమ్ నుంచి తప్పించడానికి అగార్కర్‌కు బాధ్యతలు ఎందుకు అప్పజెప్పినట్టు..? కోహ్లీ పొట్టి ప్రపంచకప్ సెలక్షన్ నుంచి దూరంగా ఉండేందుకు గాను అతడు అగార్కర్‌కు మార్చి 15ను డెడ్‌లైన్‌గా విధించినట్టు సమాచారం. ఈ విషయంలో అగార్కర్ వల్ల కాకుంటే ఇతర సెలక్టర్లైనా ఈ పని చేయాల్సి ఉంటుంది. జై షా అంతకుముందే రోహిత్‌ను ఇదే విషయం అడిగితే అతడు కోహ్లీ లేకుండా తాము ఆడలేమని చెప్పినట్టు తెలుస్తోంది. కోహ్లీ తప్పకుండా టీ20 వరల్డ్ కప్ ఆడాలి. అందుకు సంబంధించిన అధికారిక సమాచారం త్వరలోనే వెల్లడవ్వాలని ఆశిద్దాం. అవివేకులు (జై షాను ఉద్దేశిస్తూ) టీమ్ సెలక్షన్ ప్రక్రియలో పాలు పంచుకోవద్దు..’ అని ట్వీట్ చేశాడు.
Why should Jay Shah, he is not a selector, to give responsibility to Ajit Agarkar to talk to the other selectors and convince them that Virat Kohli is not getting a place in the T20 team. For this, time was given till 15th March. If sources are to be believed, Ajit Agarkar was… pic.twitter.com/FyaJSClOLw
— Kirti Azad (@KirtiAzaad) March 17, 2024
అమెరికా / వెస్టిండీస్ వేదికగా జరగాల్సి ఉన్న పొట్టి ప్రపంచకప్‌లో స్లో పిచ్‌ల కారణంగా కోహ్లీని పక్కనబెట్టనున్నారని గత వారం రోజులుగా సోషల్ మీడియాతో పాటు ప్రధాన స్రవంతి మీడియాలోనూ వార్తలు వస్తున్నాయి. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఈ నేపథ్యంలో కృతి ఆజాద్ పై విధంగా స్పందించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

