Wolrd Cup | సచిన్ రికార్డు బద్దలు కొట్టిన న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్
Wolrd Cup | వన్డే ప్రపంచకప్‌లో దుమ్మురేపుతున్న న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలుకొట్టాడు.
Wolrd Cup | వన్డే ప్రపంచకప్‌లో దుమ్మురేపుతున్న న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలుకొట్టాడు. న్యూజిలాండ్ స్పిన్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ఈ మెగాటోర్నీలో అనామకుడిగా అడుగుపెట్టిన రచిన్.. లీగ్ దవ ముగిసే సమయానికి అత్యుత్తమ ఆటతీరుతో నయా స్టార్‌గా ఎదిగాడు. ఈ క్రమంలో పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా శ్రీలంకతో పోరులో 34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేసి పెవిలియన్ చేరిన రచిన్ పిన్న వయసులో వరల్డ్‌కప్‌లో ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్‌గా సచిన్‌ను వెనక్కినెట్టి అగ్రస్థానంలో నిలిచాడు.
తాజా మెగాటోర్నీలో ఓపెనర్‌గా బరిలోకి దిగి దంచికొడుతున్న రచిన్ రవీంద్ర 565 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తద్వారా 25 ఏండ్లు నిండక ముందు ఓ వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. గతంలో 1996 వన్డే ప్రపంచకప్‌లో సచిన్ 523 పరుగులు చేయగా.. ఇప్పుడు రచిన్ 23 ఏండ్ల వయసులో ఆ మార్క్ దాటి అగ్రస్థానానికి చేరాడు.
తొలి వరల్డ్‌కప్‌లోనే మూడు సెంచరీలు
డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌తో జరిగిన టోర్నీ ఆరంభ పోరులోనే అజేయ సెంచరీ (96 బంతుల్లో 123 నాటౌట్; 11 ఫోర్లు, 5 సిక్సర్లు)తో తన ఆగమనాన్ని ఘనంగా చాటుకున్న రవీంద్ర అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. రెండో మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై అర్ధశతకం (51) సాధించిన రచిన్.. బంగ్లాదేశ్‌పై (9)తో పోరులో ఎక్కువ సేపు నిలువలేకపోయాడు. ఆ తర్వాత అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చి 32 పరుగులు చేసిన రవీంద్ర.. భారత్‌తో పోరులో 75 పరుగులు చేసి తన విలువ చాటుకున్నాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో (89 బంతుల్లో 116; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) దుమ్మురేపిన రచిన్.. దక్షిణాఫ్రికాతో పోరులో విఫలమైనా (9).. ఆ తర్వాత పాకిస్థాన్‌పై దంచికొట్టాడు. 94 బంతుల్లో 15 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 108 పరుగులు చేసిన కివీస్.. వరల్డ్‌కప్‌లో అత్యధిక స్కోరు (401) చేయడంలో ఇతోధిక సాయం చేశాడు. మొత్తంగా వరల్డ్‌కప్‌లో బరిలోకి దిగిన మొదటి సారే మూడు సెంచరీలు ఓ హాప్ సెంచరీతో రాణించిన రచిన్ రవీంద్ర ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Last Man In Tower | మనసును కదిలించే భావోద్వేగాల ప్రయాణం.. ఓటీటీలోకి మనోజ్ బాజ్‌పాయ్ ‘లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్’
Swag of Arjun | నాగచైతన్య ‘వృషకర్మ’ నుంచి ‘స్వాగ్ ఆఫ్ అర్జున్’ ఫస్ట్ సింగిల్ అప్డేట్!
Tyson Naidu | బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘టైసన్ నాయుడు’ నుంచి ‘మదరాసి రబ్బరు బొమ్మ’ మాస్ ఫోక్ సాంగ్ అప్డేట్!
AP News | మురసు తుపాను ఎఫెక్ట్.. రేపు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు..!
Ear Wax | గులిమి అంటే ఏమిటి.. దీని వల్ల లాభమా, నష్టమా.. తరచూ తొలగించాలా..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

