మ్యాడ్రిడ్ (స్పెయిన్): టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ మళ్లీ రాకెట్ పట్టాడు. గురువారం అతడు వరల్డ్ నంబర్ వన్ యానిక్ సిన్నర్తో పాటు ప్రముఖ ఫుట్బాల్ జట్టు అయిన రియల్ మ్యాడ్రిడ్ ఆటగాళ్లు జుడ్ బెల్లింగ్హమ్, తిబాట్ కొర్టియస్తో కలిసి టెన్నిస్ ఆడాడు. మ్యాడ్రిడ్ ఓపెన్ ప్రమోషన్ కోసం ఫుట్బాల్, టెన్నిస్ స్టార్లు ఈ మ్యాచ్ ఆడారు.