Prithvi Shaw | ఢిల్లీ ఓపెనర్‌ను వెంటాడుతున్న వివాదం.. జైలు తప్పదా..?
Prithvi Shaw : ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా(Prithvi Shaw)కు చిక్కులు తప్పేలా లేవు. నిరుడు ఒక పబ్‌లో జరిగిన గొడవ కేసులో ఈ చిచ్చరపిడుగు జైలుకు వెళ్లే చాన్స్ ఉంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సప్న గిల్(Sapna Gill) తనను షా వేధించాడంటూ...
Prithvi Shaw : ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా(Prithvi Shaw)కు చిక్కులు తప్పేలా లేవు. నిరుడు ఒక పబ్‌లో జరిగిన గొడవ కేసులో ఈ చిచ్చరపిడుగు జైలుకు వెళ్లే చాన్స్ ఉంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సప్న గిల్(Sapna Gill) తనను షా వేధించాడంటూ కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసును తాజాగా ముంబై కోర్టు తిరగదోడింది.
షా, సప్న గిల్ కేసుకు సంబంధించిన విచారణ నివేదికను సమర్పించాలని మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎస్సీ తైడే (SC Tayde) గురువారం పోలీసులను ఆదేశించాడు. జూన్ 19వ తేదీ కల్లా రిపోర్టును తమ ముందు ఉంచాలని చెప్పాడు. దాంతో, షా జైలుకు వెళ్లే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.
అసలేం జరిగిందంటే..?
2023లో ఆంధేరి బార్లో పృథ్వీ షా, అతడి స్నేహితుడు అశిష్ యాదవ్‌లు తమతో గొడవ పడ్డారని.. ఇద్దరూ తమపై బేస్‌బాల్ బ్యాటుతో దాడి చేశారని సప్న గిల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరింది. కానీ, పోలీసులు పట్టించుకోలేదు. అయితే.. సప్న అనవసర రాద్ధాంతం చేస్తుందని, తనను కావాలనే ఇరికిస్తోందని షా సైతం ఆమెపై కంప్లైంట్ చేశాడు. దాంతో, సప్న ముంబై కోర్టును ఆశ్రయించింది.
సప్న గిల్, పృథ్వీ షా

పేలవ ఫామ్‌తో..
టీమిండియాకు ఆడాల్సిన షా 16వ సీజన్లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. పేలవ ఫామ్‌తో వెస్టిండీస్ పర్యటనకు దూరమయ్యాడు. అనంతరం ఇంగ్లండ్‌లో జరిగిన వన్డే కప్‌లో అతడు పరుగుల వరద పారించాడు. దాంతో, మళ్లీ ముంబై రంజీ జట్టులో చోటు దక్కించుకున్నాడు. 17వ సీజన్లో రెండు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమైన షా అవకాశం వచ్చిన తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీతో చెలరేగిన ఈ డాషింగ్ బ్యాటర్.. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో 10 పరుగులతో నిరాశ పరిచాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

