దుబాయ్ : ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ తన కెరీర్లో తొలిసారి ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఇటీవల బంగ్లాదేశ్తో ముగిసిన రెండో టెస్టులో పది వికెట్ల ప్రదర్శన చేసిన ఈ లెఫ్టార్మ్ పేసర్.. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్లో రెండు స్థానాలను మెరుగుపరుచుకుని 872 రేటింగ్ పాయింట్లతో టాప్ ప్లేస్కు చేరుకున్నాడు.
భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా రెండో స్థానానికి పడిపోయాడు. ర్యాంకింగ్స్లో నిరుడు రెండో స్థానానికి చేరడమే స్టార్క్ సుదీర్ఘ కెరీర్లో అత్యుత్తమం కాగా ఇప్పుడు ఫస్ట్ ర్యాంకుకు చేరడం గమనార్హం. టెస్టు బ్యాటర్ల విషయానికొస్తే హ్యారీ బ్రూక్ (ఇంగ్లండ్) మొదటి స్థానంలో కొనసాగుతుండగా రిషబ్ పంత్ ఆరు స్థానాలు ఎగబాకి టాప్-10 లోకి (ఏడో ప్లేస్) వచ్చాడు.