పారిస్: ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో కొత్త చాంపియన్ అవతరించింది. అసలు ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి అద్భుత ప్రదర్శన కనబరుస్తూ రష్యా నయా సంచలనం మిరా ఆండ్రీవా పారిస్‌లో తళుక్కుమంది. తన విజయాలు గాలివాటం కాదని నిరూపిస్తూ చారిత్రక రోలాండ్ గారోస్‌లో టైటిల్‌తో గర్జించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఆండ్రీవా 6-3, 6-2తో మాయ హలిన్స్కా(పోలాండ్)పై చిరస్మరణీయ విజయం సాధించింది. ఈ క్రమంలో తొలిసారి తన కెరీర్లో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సగర్వంగా ముద్దాడింది. 1992లో మోనికా సెలెస్(18 ఏండ్లు) తర్వాత పిన్న వయసులో ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన రెండో ప్లేయర్‌గా 19 ఏండ్ల ఆండ్రీవా సరికొత్త రికార్డు నెలకొల్పింది.
కెరీర్లో మొదటిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ మ్యాచ్ ఆడుతున్న నేపథ్యంలో ఇద్దరు కోర్టులో కుదురుకునేందుకు కొంత సమయం తీసుకున్నారు. తొలి సెట్లో ఆండ్రీవా సర్వీస్‌లో డబుల్‌ఫాల్ట్స్ చేస్తే..మాయ ఫోర్‌హ్యాండ్ సంధించడంలో విఫలమైంది. దీంతో ఒక దశలో స్కోరు 3-3తో సమమైంది. బ్యాక్‌హ్యాండ్ షాట్ ఆడే క్రమంలో మాయ కొట్టిన బంతి నెట్‌కు తాకడంతో 4-3 ఆధిక్యంలోకి వెళ్లిన ఆండ్రీవా అదే దూకుడు కొనసాగిస్తూ 5-3, 6-3తో మొదటి సెట్‌ను కైవసం చేసుకుంది. అప్పటికే సెట్ కోల్పోయి ఒత్తిడిలో ఉన్న హలిన్స్కా మరోమారు అనవసర తప్పిదం చేయడంతో ఆండ్రీవాకు 2-0 ఆధిక్యం దక్కింది. దీనికి తోడు వరుసగా మూడు బ్రేక్ పాయింట్లు చేజార్చుకున్న ఈ పోలాండ్ ప్లేయర్ 0-4తో వెనుకంజలో నిలిచింది. మొత్తంగా ఆండ్రీవా వరుస సెట్లలో ప్రత్యర్థిని ఓడించి మట్టికోర్టులో మహారాణి కిరీటాన్ని కైవసం చేసుకున్నది.
ప్రైజ్‌మనీ: