స్విమ్మర్ శ్యామలకు మంత్రి అభినందన

హైదరాబాద్, ఆట ప్రతినిధి: అమెరికాలో జరిగే ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌నకు ఎంపికైన తెలంగాణ వెటరన్ స్విమ్మర్ గోలి శ్యామలను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అభినందించారు. 35 కిలోమీటర్ల దూరంతో 15డిగ్రీల సెల్సియస్ కల్గిన వాటర్‌లో స్విమ్మింగ్ రేసులో రాణించాలని శ్యామలకు మంత్రి సూచించారు. భవిష్యత్‌లోనూ స్విమ్మింగ్‌లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మంత్రి ఆకాంక్షించారు. అయితే తనకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించాలని శ్యామల కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి తగిన సాయం అందిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. మరోవైపు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన సింధు, సాయి ప్రణీత్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్శెట్టిని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అభినందించారు. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించి దేశానికి, రాష్ర్టానికి మరింత గుర్తింపు తీసుకురావాలని అన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- shyamala
- srinivas goud
- swimmer
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

