MI vs CSK : పంతొమ్మిదో సీజన్లో నిరాశపరుస్తున్న ముంబై ఇండియన్స్(MI), చెన్నై సూపర్ కింగ్స్(CSK) బిగ్ ఫైట్‌కు సిద్ధమయ్యాయి. పాయింట్ల పట్టికలో వరసగా 7, 8 స్థానాల్లో ఉన్న ముంబై, చెన్నైకి మూడో విజయంపై కన్నేశాయి. వాంఖడే వేదికగా జరుగుతున్న టాస్ గెలిచిన ముంబై సారథి హార్దిక్ పాండ్యా ఛేదనకే మొగ్గు చూపాడు. ప్లే ఆఫ్స్ రేసులో వెనకబడిన మాజీ ఛాంపియన్లలో గెలుపుతో ముందంజ వేసే జట్టేదో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.
గత మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై భారీ విజయంతో జోరు మీదున్న ముంబై సొంత మైదానంలో తడాఖా చూపాలనుకుంటోంది. రెండే రెండు విజయాలతో ప్లే ఆఫ్స్ రేసులో వెనకబడిన చెన్నైకి మరో షాక్ ఇవ్వాలని పాండ్యా సేన భావిస్తోంది. గుజరాత్‌తో ఆడిన తుది జట్టునే ముంబై కొనసాగిస్తుండగా.. కుర్రాడు ఉర్విల్ పటేల్‌ను సీఎస్కే ఆడిస్తోంది.
ముంబై తుది జట్టు : డికాక్(వికెట్ కీపర్), నమన్ ధిర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), తిలక్ వర్మ, రూథర్‌ఫోర్డ్, శాంట్నర్, బుమ్రా, క్రిష్ భగత్, గజన్ఫర్, అశ్వనీ కుమార్.
ఇంప్యాక్ట్ సబ్స్ – విల్ జాక్స్, రాజ్ బవా, శార్థూల్, డానిశ్ మలేవర్, మయాంక్ మార్కండే.
చెన్నై తుది జట్టు : శాంసన్(వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), సర్ఫరాజ్ ఖాన్, బ్రెవిస్, దూబే, కార్తిక్ శర్మ, ఓవర్టన్, నూర్ అహ్మద్, అన్షుల్ కంభోజ్, గర్జప్నీత్ సింగ్, ముకేశ్ చౌదరీ.
ఇంప్యాక్ట్ సబ్స్ – ప్రశాంత్ వీర్, మాథ్యూ షార్ట్, మ్యాట్ హెన్రీ, అకీల్ హొసేన్, ఉర్విల్ పటేల్.