MCC : పంతొమ్మిదో సీజన్లో అంగ్క్రిష్ రఘువంశీ (Angkrish Raghuvanshi) అనూహ్యంగా ఔటైన విషయం తెలిసిందే. ఫీల్డింగ్‌కు అడ్డుపడినందుకు అంపైర్ అతడిని ఔట్‌గా ప్రకటించడంపై చెలరేగుతున్న వివాదానికి మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (Merylebone Cricket Club) ముగింపు పలికింది. థర్డ్ అంపైర్ నిర్ణయంపై కోల్‌కతా అభ్యంతరం వ్యక్తం చేయడంలో అర్ధం లేదని.. నిబంధనల ఉల్లంఘన స్పష్టంగా కనిపించినందునే రఘువంశీని అంపైర్ ఔటిచ్చారని ఎంసీసీ పేర్కొంది. అసలు రఘుంశీని ఎందుకు ఔటివ్వాల్సి వచ్చింది? అనేది కూడా వివరణ ఇచ్చిందీ క్లబ్.
ఈడెన్ గార్డెన్స్‌లో ఏప్రిల్ 26న లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆదిలోనే కష్టాల్లో పడింది. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రఘువంశీ.. ప్రిన్స్ యాదవ్ ఓవర్లో సింగిల్ తీయాలనుకున్నాడు. బంతిని లెగ్ సైడ్ ఆడి ఆఫ్ సైడ్ నుంచి పరుగందుకున్నాడు కూడా. కానీ, బంతిని గమనించిన నాన్‌స్ట్రయికర్ కామెరూన్ గ్రీన్ వద్దని వారించాడు. దాంతో.. రఘువంశీ అలానే వెనక్కి మళ్లాల్సింది పోయి.. లెగ్‌సైడ్ పిచ్ మధ్య నుంచి లెగ్ సైడ్ వైపు తిరిగాడు. అదే దిశలో ఫీల్డర్ బంతిని విసరడం చూసి డైవ్ చేశాడు. రఘువంశీ ఉద్దేశపూర్వకంగానే ఫీల్డింగ్‌కు అడ్డుపడ్డాడని లక్నో ఆటగాళ్లు అప్పీల్ చేశారు.
MCC, the guardians of the Laws of Cricket, has backed the decision to rule Angkrish Raghuvanshi out ‘obstructing the field’ during an IPL clash between Kolkata Knight Riders and Lucknow Super Giants
Here’s why: https://t.co/ePqN6OLoUb pic.twitter.com/eOo16GQECT
— ESPNcricinfo (@ESPNcricinfo) April 30, 2026
రీప్లేను పరిశీలించిన థర్డ్ అంపైర్ 37.1.1 చట్టం ప్రకారం అతడు కావాలనే లెగ్‌సైడ్ తిరిగి క్రీజుల వైపు పరుగెత్తి వికెట్ కాపాడుకున్నాడని తేల్చాడు. తను అలా లెగ్ సైడ్ మళ్లడం ద్వారా ఫీల్డింగ్ జట్టు రనౌట్ చేయకుండా అడ్డుపడ్డాడని నిరూపితమైంది. అందుకే రఘువంశీని ఔటివ్వడం సరైందేనని క్రికెట్ అంపైరింగ్ అండ్ స్కోరింగ్ అనే పుస్తకంలో టామ్ స్మిత్ పేర్కొన్న వ్యాఖ్యలను ఎంసీసీ ఉటంకించింది. మొత్తంగా .. ఐపీఎల్లో ఇలా ఔటైనా నాలుగో ఆటగాడు రఘువంశీ. అతడి కంటే ముందు యుసుఫ్ పఠాన్(2013), అమిత్ మిశ్రా (2019), రవీంద్ర జడేజా (2024)లు ఫీల్డింగ్‌కు అడ్డుపడినందుకు ఔటయ్యారు.
According to ICC Laws based on the MCC Laws (under Law 37 – Obstructing the Field)
If the batter turns while running and Ball hits their back… This is considered natural movement
Angkrish Raghuvanshi was clearly NOT OUT#LSGvKKR | #IPL2026 | #LSGvsKKR pic.twitter.com/BHP0qrg9ot
— Swapnil Vats (@iamswapnilvats) April 26, 2026
మ్యాచ్ విషయానికొస్తే.. కోల్‌కతా నిర్దేశించిన 155 పరుగుల ఛేదనలో లక్నో తడబడినా టెయిలెండర్ల పుణ్యమాని బతికిపోయింది. ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠ రేపిన పోరులో షమీ చివరి బంతికి సిక్సర్ బాదగా స్కోర్లు సమమయ్యాయి. అయితే.. సూపర్ ఓవర్లో సునీల్ నరైన్ ఒక్కటే పరుగు ఇచ్చి రెండు వికెట్లు తీయగా.. కేకేఆర్ వైస్ కెప్టెన్ రింకూ సింగ్ ఫోర్‌తో జట్టును గెలిపించాడు.