FIFA World Cup : అమెరికా, కెనడా, మెక్సికో సంయక్తంగా ఆతిథ్యమిస్తున్న ఫిఫా వరల్డ్‌కప్ 2026లో ‘గోల్డెన్ బూట్’ (Golden Boot) రేసు ఆసక్తి రేపుతోంది. అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ(Lionel Messi) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. కిలియన్ ఎంబాపే(Kylian Mbappe) ‘నేను ఉన్నానంటూ’ దూసుకొచ్చాడు. శనివారం వరకూ మెస్సీ ఏడు గోల్స్‌తో టాప్‌లో ఉండగా ఎంబాపే సైతం అతడి సరసన చేరాడు.
గోల్డెన్ బూట్ కోసం ఈసారి కూడా గట్టిపోటీ నెలకొంది. 16వ రౌండ్లో పరాగ్వేపై పెనాల్టీని గోల్‌గా మలిచిన ఎంబాపే, మెస్సీతో సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. నాకౌట్లో అర్జెంటీనా, ఫ్రాన్స్ మరిన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశమున్నందున గోల్డెన్ బూట్ కోసం మెస్సీ, ఎంబాపేల మధ్యే పోటీ ఉండనుంది.
🔥𝐓𝐇𝐄 𝐆𝐎𝐋𝐃𝐄𝐍 𝐁𝐎𝐎𝐓 𝐑𝐀𝐂𝐄 𝐈𝐒 𝐄𝐗𝐏𝐋𝐎𝐃𝐈𝐍𝐆!!!
⚽️ Top scorers at the 2026 FIFA World Cup:
🇫🇷 Kylian Mbappé – 7 GOALS
🇦🇷 Lionel Messi – 7 GOALS👊 Absolute madness!
👀 Two legends going head-to-head… who’s walking away with the Golden Boot? pic.twitter.com/hfP71XkMS4
— FIFA World Cup Stats (@alimo_philip) July 5, 2026
సాకర్ వరల్డ్‌కప్‌లో అత్యధిక గోల్స్ వీరుడిని గోల్డెన్ బూట్‌తో సత్కరించడం ఆనవాయితీ. ఈసారి ఈ బూట్ కోసం దిగ్గజం లియోనల్ మెస్సీకి, కిలియన్ ఎంబాపే నుంచి తీవ్రమైన పోటీ ఎదురవుతోంది. గత ఎడిషన్‌లో(2022) గోల్డెన్ బూట్‌ను తన్నుకుపోయిన ఎంబాపే ఈ దఫా రేసులోనే ఉన్నాడు. క్రిస్టియానో రొనాల్డో(పోర్చుగల్) వెనకబడగా.. ఏడు గోల్స్‌తో మెస్సీతో సరిసమానంగా నిలిచాడీ ఫ్రాన్స్ ఫార్వడ్డ్ ఆటగాడు.
Kylian Mbappé ties Leo Messi in the 2026 World Cup Golden Boot race! pic.twitter.com/puHy5hYPOU
— Kalshi FC (@KalshiFC) July 4, 2026
తొలి మ్యాచ్‌లోనే అల్జీరియాపై హ్యాట్రిక్ గోల్స్ చేసిన అర్జెంటీనా కెప్టెన్.. మొత్తంగా నాలుగు మ్యాచుల్లో ఏడు గోల్స్ సాధించాడు. లెజెండరీ ఆటగాడిగా ఎదుగుతున్న ఎంబాపే సైతం 5 మ్యాచుల్లో ఏడు గోల్స్‌తో గోల్డెన్ బూట్ రేసులో నిలిచాడు. హ్యారీ కేన్(ఇంగ్లండ్), ఎర్లింగ్ హోలాండ్(నార్వే)లు.. ఐదేసి గోల్స్‌తో సంయుక్తంగా మూడో స్థానంలో కొనసాగుతున్నారు.