రెన్షా 190.. ఆసీస్ 390
మాట్ రెన్షా (190) భారీ శతకంతో చెలరేగడంతో దక్షిణాఫ్రికాతో మొదటి టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 187/6తో శనివారం ఆట కొనసాగించిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 390 పరుగుల వద్ద ఆలౌటైంది. మరో ఓవర్‌నైట్ బ్యాటర్, కెప్టెన్ కమిన్స్ (43)తో పాటు స్టార్క్ (6) త్వరగానే ఔటవడంతో ఓ దశలో 230/8తో తక్కువ స్కోరుకే పరిమితం అయ్యేలా కనిపించిన ఆసీస్‌ను రెన్షా అద్భుత ఆటతో ఆదుకున్నాడు.
డర్బన్: మాట్ రెన్షా (190) భారీ శతకంతో చెలరేగడంతో దక్షిణాఫ్రికాతో మొదటి టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 187/6తో శనివారం ఆట కొనసాగించిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 390 పరుగుల వద్ద ఆలౌటైంది. మరో ఓవర్‌నైట్ బ్యాటర్, కెప్టెన్ కమిన్స్ (43)తో పాటు స్టార్క్ (6) త్వరగానే ఔటవడంతో ఓ దశలో 230/8తో తక్కువ స్కోరుకే పరిమితం అయ్యేలా కనిపించిన ఆసీస్‌ను రెన్షా అద్భుత ఆటతో ఆదుకున్నాడు.
నేథన్ లైయన్ (27)తో తొమ్మిదో వికెట్‌కు ఏకంగా 134 పరుగులు జోడించి జట్టుకు మంచి స్కోరు అందించాడు. డబుల్ సెంచరీ ముంగిట సైమన్ హార్మర్ బౌలింగ్‌లో ఆఖరి వికెట్‌గా ఔటయ్యాడు. సఫారీ బౌలర్లలో ముల్డర్ నాలుగు, యాన్సెన్ మూడు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు రెండో రోజు చివరకు 27/1 స్కోరుతో నిలిచింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

