Mancheter Club | ఆటగాళ్ల వేతనం పరిమితికి మాంచెస్టర్ యునైటెడ్ కొత్త రూల్.. పేరేంటో తెలుసా..?
కొత్త నిబంధన ప్రకారం ఆటగాళ్ల వేతనం వారానికి 2 లక్షల యూరోలు
Mancheter Club : మాంచెస్టర్ యునైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్ కొత్త ఏడాదిలో కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఆటగాళ్ల వేతనాలపై పరిమితి విధించడం కోసం తెచ్చిన ఈ కొత్త రూల్ పేరేంటంటే.. ‘రొనాల్డో రూల్’. కొత్త నియమానికి తమ క్లబ్ మాజీ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో పేరు పెట్టడం విశేషం. ఈ నిబంధన ప్రకారం ఆటగాళ్ల వేతనం వారానికి 2 లక్షల యూరోల (రూ. 1,75,46,501 కోట్లు) లోపు ఉండనుంది. ఉన్నట్టుండి ఈ రూల్ తేవడానికి కారణం ఏంటంటే.. ఎక్కువ ఆదాయం సంపాదించే ఆటగాళ్లను చూసి కొందరు అసూయ పడుతున్నారట. దాంతో, డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్ల మధ్య ఈర్ష్య, అసూయ వంటివి లేకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు మాంచెస్టర్ క్లబ్ ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాదు కొత్త నిబంధనను పక్కాగా అమలు చేస్తామని కూడా వెల్లడించింది. మాజీ ప్లేయర్ రొనాల్డోకు మాంచెస్టర్ క్లబ్ వారానికి 5 లక్షల యూరోలు (4,38,66,253 కోట్లు) చెల్లించేది.
ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు రొనాల్డో ఒక ఇంటర్వ్యూలో మాంచెస్టర్ క్లబ్ గురించి సంచలన ఆరోపణలు చేశాడు. తనను క్లబ్ నుంచి పంపించడానికి కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని, మేనేజర్ తనను గౌరవించడని రొనాల్డో అన్నాడు. దాంతో, అతడితో కుదుర్చుకున్న కాంట్రాక్టును రద్దు చేసింది. స్టార్ స్ట్రయికర్ అయిన రొనాల్డోనూ సౌదీ అరేబియాకు చెందిన అల్ నస్రీ క్లబ్ భారీ ధరకు సొంతం చేసుకుంది. 2025 వరకు అతను ఆ క్లబ్‌తో కొనసాగనున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suriya | ‘రోలెక్స్’ సినిమా ఎప్పుడు వస్తుంది.. ఆయననే అడగాలంటూ సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు.. !
Raptadu | రాప్తాడు రంపం దాడి నిందితుడు హేమంత్ కుడికాలు తొలగింపు.. రెండో కాలు తొలగించాల్సిందేనా?
Cyclone Murasu | ఏపీ తీరాన్ని దాటిన తీవ్ర తుపాను ‘మురాసు’.. గంటకు 120 కి.మీ. వేగంతో ఈదురుగాలులు
OTT Movies | ఓటీటీలో ఈ వారం ఏకంగా 24 సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ఎక్కడెక్కడ స్ట్రీమింగ్ కానున్నాయి అంటే?
Tabu | నాగార్జున 100వ సినిమాలో టబు స్పెషల్ రోల్.. గ్లింప్స్ ఎప్పుడు విడుదల కానుంది అంటే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

