IPL 2023 | ముంబై ఇండియన్స్ VS లక్నో సూపర్ జెయింట్స్ అప్డేట్స్
IPL 2023 : ఐపీఎల్ ప్లే ఆఫ్స్, నాకౌట్ మ్యాచులో ఇప్పటివరకూ ఓటమెరుగని ముంబై ఇండియన్స్ రికార్డు విజయం సాధించింది. 16వ సీజన్ల్(IPL 2023) ఎలిమినేటర్(Eliminator match) మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై 81 పరుగుల తేడాతో గెలిచింది. క్వాలిఫైయర్ 2 పోరులో ముంబై డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్‌ను ఢీ కొట్టనుంది.
IPL 2023 : ఐపీఎల్ ప్లే ఆఫ్స్, నాకౌట్ మ్యాచులో ఇప్పటివరకూ ఓటమెరుగని ముంబై ఇండియన్స్ రికార్డు విజయం సాధించింది. 16వ సీజన్ల్(IPL 2023) ఎలిమినేటర్(Eliminator match) మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై 81 పరుగుల తేడాతో గెలిచింది. 183 టార్గెట్ ఛేదనలో మార్కస్ స్టోయినిస్(40), దీపక్ హుడా(15) మాత్రమే పోరాడారు. ఆకాశ్ మధ్వాల్ ఐదు వికెట్లతో లక్నో పతనాన్ని శాసించాడు. దాంతో, కృనాల్ పాండ్యా సేన ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది. క్వాలిఫైయర్ 2 పోరులో ముంబై డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్‌ను ఢీ కొట్టనుంది.
A MI-ghty special victory! 😎
The Mumbai Indians win by 81 runs and progress to the #Qualifier2 of #TATAIPL 2023 👏🏻👏🏻
Scorecard ▶️ https://t.co/CVo5K1wG31#TATAIPL | #Eliminator | #LSGvMI pic.twitter.com/77zW6NmInn
— IndianPremierLeague (@IPL) May 24, 2023
-
24 May 2023 11:20 PM (IST)
లక్నో ఆలౌట్.. 81 రన్స్‌తో గెలిచిన ముంబై
ఆకాశ్ మధ్వాల్ వేసిన 16.3వ ఓవర్లో మొహ్సిన్ ఖాన్(0) ఔటయ్యాడు.దాంతో, లక్నో 101 పరుగులకు ఆలౌటయ్యింది. ముంబై 81 రన్స్ తేడాతో గెలుపొందింది. క్వాలిఫైయర్ 2కు అర్హత సాధించింది.
-
24 May 2023 10:50 PM (IST)
మార్కస్ స్టోయినిస్ రనౌట్
మార్కస్ స్టోయినిస్(40) రనౌటయ్యాడు. రెండో రన్ తీసే క్రమంలో టిమ్ డేవిడ్ విసిరిన త్రోను అందుకున్న ఇషాన్ కిషన్ వికెట్లను గిరాటేశాడు. దాంతో, లక్నో ఆరో వికెట్ పడింది. దీపక్ హుడా(10) క్రీజులో ఉన్నాడు
-
24 May 2023 10:40 PM (IST)
లక్నోకు షాకిచ్చిన మధ్వాల్.. పూరన్ ఔట్
ఆకాశ్ మధ్వాల్‌కు లక్నోకు షాకిచ్చాడు. డేంజరస్ నికోలస్ పూరన్(0)ను డకౌట్ చేశాడు. దాంతో వరుస బంతుల్లో లక్నో రెండు కీలక వికెట్లు కోల్పోయింది.
-
24 May 2023 10:38 PM (IST)
ఆకాశ్ మధ్వాల్‌కు రెండో వికెట్.. కష్టాల్లో లక్నో
ఆకాశ్ మధ్వాల్‌కు రెండో వికెట్ తీశాడు. ఆయుశ్ బదోని(1)ను ఔట్ చేశాడు. తడబడిన అతను భారీ షాట్ ఆడబోయి బౌల్డ్ అయ్యాడు. దాంతో, దాంతో, 74 వద్ద లక్నో నాలుగో వికెట్ కోల్పోయింది. నికోలస్ పూరన్, వచ్చాడు. మార్కస్ స్టోయినిస్(36) క్రీజులో ఉన్నాడు.
-
24 May 2023 10:31 PM (IST)
బిగ్ వికెట్ తీసిన చావ్లా
పీయూష్ చావ్లా బిగ్ వికెట్ తీశాడు. కృనాల్ పాండ్యా(8) ను ఔట్ చేశాడు. భారీ షాట్ ఆడిన పాండ్యా బౌండరీ వద్ద టిమ్ డేవిడ్ చేతికి చిక్కాడు. దాంతో, 69 వద్ద లక్నో మూడో వికెట్ కోల్పోయింది. ఓవర్లో మార్కస్ స్టోయినిస్(36) క్రీజులో ఉన్నాడు.
-
24 May 2023 10:20 PM (IST)
చావ్లా ఓవర్లో రెండు ఫోర్లు
పీయూష్ చావ్లా ఓవర్లో మార్కస్ స్టోయినిస్(33), కృనాల్ పాండ్యా(7) చెరొక ఫోర్ బాదారు. 11 పరుగులు వచ్చాయి. 7 ఓవర్లకు స్కోర్..65/2
-
24 May 2023 10:13 PM (IST)
స్టోయినిస్ దంచుతుండు
హృతిక్ షోకీన్ ఓవర్లో మార్కస్ స్టోయినిస్(28) దంచాడు. మూడో బంతికి ఫోర్ కొట్టాడు. ఆ తర్వాత లాంగాన్‌లో భారీ సిక్స్ బాదాడు. కృనాల్ పాండ్యా(2) క్రీజులో ఉన్నాడు. 6 ఓవర్లకు స్కోర్.. 54/2
-
24 May 2023 10:08 PM (IST)
స్టోయినిస్‌కు లైఫ్
కామెరూన్ గ్రీన్ ఓవర్లో మార్కస్ స్టోయినిస్(12)కు లైఫ్ దొరికింది. బౌండరీ వద్ద నేహల్ వధేరా క్యాచ్ వదిలేశాడు. మూడో బంతికి ఫోర్ కొట్టాడు. కృనాల్ పాండ్యా(1)క్రీజులో ఉన్నాడు. 5 ఓవర్లకు స్కోర్.. 36/2
-
24 May 2023 10:00 PM (IST)
లక్నోకు షాక్.. డేంజరస్ మేయర్స్ ఔట్
ఇంపాక్ట్ ప్లేయర్ కైల్ మేయర్స్ (18) ఔటయ్యాడు. క్రిస్ జోర్డాన్ బౌలింగ్‌లో కామెరూన్ గ్రీన్ చేతికి చిక్కాడు. దాంతో లక్నో కష్టాల్లో పడింది. కృనాల్ పాండ్యా(0)క్రీజులో ఉన్నాడు.
-
24 May 2023 09:57 PM (IST)
మేయర్స్ దూకుడు
ఇంపాక్ట్ ప్లేయర్ కైల్ మేయర్స్ (16) బెహ్రన్‌డార్ఫ్ బౌలింగ్‌లో తొలి బంతికి ఫోర్ కొట్టాడు. కృనాల్ పాండ్యా(0)క్రీజులో ఉన్నాడు. 3 ఓవర్లకు స్కోర్.. 21/1.
-
24 May 2023 09:52 PM (IST)
తొలి వికెట్ తీసిన మధ్వాల్
ఆకాశ్ మధ్వాల్ తొలి వికెట్ తీశాడు. ప్రేరక్ మన్కడ్(3)ను ఔట్ చేశాడు. భారీ షాట్ ఆడిన మన్కడ్ బౌండరీ వద్ద హృతిక్ షోకీన్ చేతికి చిక్కాడు. దాంతో, 12 వద్ద లక్నో తొలి వికెట్ కోల్పోయింది. కృనాల్ పాండ్యా వచ్చాడు. ఇంపాక్ట్ ప్లేయర్ కైల్ మేయర్స్ (9) క్రీజులో ఉన్నాడు. 2 ఓవర్లకు స్కోర్.. 12/1.
-
24 May 2023 09:44 PM (IST)
తొలి ఓవర్లో మేయర్స్ రెండు ఫోర్లు
జేసన్ బెహ్రన్‌డార్ఫ్ వేసిన తొలి ఓవర్లో ఇంపాక్ట్ ప్లేయర్ కైల్ మేయర్స్ (9) దంచాడు. వరుసగా రెండు బౌండరీలు కొట్టాడు. 10 పరుగులు వచ్చాయి. ప్రేరక్ మన్కడ్(1) క్రీజులో ఉన్నాడు.
-
24 May 2023 09:26 PM (IST)
లక్నోటార్గెట్ 183
యశ్ ఠాకూర్ వేసిన 20వ ఓవర్లో ఇంపాక్ట్ ప్లేయర్ నేహల్ వధేరా(23) తొలి బంతికి ఫోర్ కొట్టాడు. మూడో బంతికి 91 మీటర్ల సిక్స్ బాదాడు. నాలుగో బంతికి బౌండరీ సాధించాడు. ఆఖరి బంతికి రవి బిష్ణోయ్ చేతికి చిక్కడు. దాంతో ముంబై 8 వికెట్లు కోల్పోయి 182పరుగులు చేసింది.
-
24 May 2023 09:20 PM (IST)
జోర్డాన్ ఔట్.. ఏడో వికెట్ డౌన్
మొహ్సిన్ ఖాన్ ఓవర్లో క్రిస్ జోర్డాన్(4) ఔటయ్యాడు. తొలి బంతికి బైస్ రూపంలో 4 రన్స్ వచ్చాయి. నాలుగో బంతికి జోర్డాన్ 2 రన్స్ తీశాడు. ఐదో బంతికి బౌండరీ వద్ద దీపక్ హుడా క్యాచ్ పట్ట డంతో వెనుదిరిగాడు. . ఇంపాక్ట్ ప్లేయర్ నేహల్ వధేరా(8) క్రీజులో ఉన్నాడు. 19 ఓవర్లకు స్కోర్.. 168/7
-
24 May 2023 09:12 PM (IST)
నవీన్ హ్యాట్రిక్ వైడ్స్.. మూడో బంతికి వికెట్
నవీన్ ఉల్ హక్ నేహల్ ఓవర్లో ఇంపాక్ట్ ప్లేయర్ నేహల్ వధేరా(8) తొలి బంతికి సిక్స్ బాదాడు. ఆ తర్వాత నవీన్ హ్యాట్రిక్ వైడ్స్ వేశాడు. అయతే.. మూడో బంతికి తిలక్ వర్మ(26) వికెట్ తీశాడు. తిలక్ కొట్టిన బంతిని బౌండరీ వద్ద దీపక్ హుడా క్యాచ్ పట్టాడు. దాంతో, దాంతో, 159 వద్ద ముంబై ఆరో వికెట్ కోల్పోయింది.
-
24 May 2023 09:01 PM (IST)
బిగ్ హిట్టర్ డేవిడ్ ఔట్
యశ్ ఠాకూర్ కీలక వికెట్ తీశాడు. బిగ్ హిట్టర్ టిమ్ డేవిడ్(13)ను ఔట్ చేశాడు. రెండో బంతికి ఫోర్ బాదిన డేవిడ్, మూడో బంతికి షాట్ ఆడాడు. బౌండరీ వద్ద దీపక్ హుడా క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. దాంతో, ముంబై సగం వికెట్లు కోల్పోయింది. తిలక్ వర్మ(26) క్రీజులో ఉన్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా నేహల్ వధేరా వచ్చాడు. 17 ఓవర్లకు స్కోర్.. 131/5
-
24 May 2023 08:48 PM (IST)
ఒకే ఓవర్లో రెండు కీలక వికెట్లు తీసిన నవీన్
నవీన్ ఉల్ హక్ ముంబైని దెబ్బకొట్టాడు. ఒకే ఓవర్లో రెండు కీలక వికెట్లు తీశాడు. డేంజరస్ సూర్యకుమార్ యాదవ్(33), కామెరూన్ గ్రీన్(41)లను ఔట్ చేశాడు. దాంతో, ముంబై 4 వికెట్లు కోల్పోయింది. టిమ్ డేవిడ్(7), తిలక్ వర్మ(18) క్రీజులో ఉన్నారు. 15 ఓవర్లకు స్కోర్.. 131/4
-
24 May 2023 08:18 PM (IST)
10 ఓవర్లకు స్కోర్.. 98/2
రవి బిష్ణోయ్ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. సూర్యకుమార్ యాదవ్(20), కామెరూన్ గ్రీన్(39) క్రీజులో ఉన్నారు. 10 ఓవర్లకు స్కోర్.. 98/2
-
24 May 2023 08:14 PM (IST)
సూర్య, గ్రీన్ చెరొక సిక్స్
మొహ్సిన్ ఖాన్ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్(20) లెగ్ సైడ్ సిక్స్ బాదాడు. ఆఖరి బంతికి కామెరూన్ గ్రీన్(39) సిక్స్ కొట్టాడు. 14 పరుగులు వచ్చాయి. 9 ఓవర్లకు స్కోర్.. 89/2
-
24 May 2023 08:09 PM (IST)
బిష్ణోయ్ రాకతో తగ్గిన స్కోర్
లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ రాకతో ముంబై స్కోర్ తగ్గింది. 5 రన్స్ ఇచ్చాడంతే. కామెరూన్ గ్రీన్(32), సూర్యకుమార్ యాదవ్(13) క్రీజులో ఉన్నారు. 8 ఓవర్లకు స్కోర్.. 75/2
-
24 May 2023 08:03 PM (IST)
ఓవర్‌కు 10 చొప్పున రన్స్.. 7 ఓవర్లకు స్కోర్ 70
ఫామ్‌లో ఉన్న కామెరూన్ గ్రీన్(30) దంచుతున్నాడు. మొహ్సిన్ ఖాన్ ఓవర్లో ఫోర్ బాదాడు. 8పరుగులు వచ్చాయి. సూర్యకుమార్ యాదవ్(10) క్రీజులో ఉన్నాడు. 7 ఓవర్లకు స్కోర్.. 70/2
-
24 May 2023 07:57 PM (IST)
దంచుతున్న గ్రీన్.. ముంబై స్కోర్ 50
ఫామ్‌లో ఉన్న కామెరూన్ గ్రీన్(23) దంచుతున్నాడు. కృనాల్ పాండ్యా ఓవర్లో ఏకంగా మూడు ఫోర్లు బాదాడు. 16 పరుగులు వచ్చాయి. సూర్యకుమార్ యాదవ్(9) క్రీజులో ఉన్నాడు. 6 ఓవర్లకు స్కోర్.. 62/2
-
24 May 2023 07:50 PM (IST)
కీలక వికెట్ తీసిన ఠాకూర్
యశ్ ఠాకూర్ కీలక వికెట్ తీశాడు. తడబడుతున్న ఇషాన్ కిషన్(15)ను పెవిలియన్ పంపాడు. ఐదో ఓవర్ నాలుగో బంతికి ఇషాన్ కీపర్ పూరన్ క్యాచ్ పట్టడంతో నిరాశగా వెనుదిరిగాడు. దాంతో, 38 రన్స్ వద్ద ముంబై రెండో వికెట్ కోల్పోయింది. గత మ్యాచ్ సెంచరీ హీరో కామెరూన్ గ్రీన్(8) క్రీజులో ఉన్నాడు.
-
24 May 2023 07:47 PM (IST)
గ్రీన్ రెండు ఫోర్లు
గత మ్యాచ్ సెంచరీ హీరో కామెరూన్ గ్రీన్(8) వచ్చీ రావడంతోనే నవీన్ ఉల్ హక్ ఓవర్లో రెండు ఫోర్లు బాదాడు. ఇషాన్ కిషన్(15) క్రీజులో ఉన్నాడు. 4 ఓవర్లకు స్కోర్.. 38/1
-
24 May 2023 07:43 PM (IST)
ముంబైకి షాక్.. రోహిత్ ఔట్
ముంబైకి షాక్.. రోహిత్ శర్మ(11) ఔటయ్యాడు. నవీన్ ఉల్ హక్ ఓవర్లో షాట్ ఆడి ఆయుశ్ బదోని చేతికి చిక్కాడు. దాంతో, 30 రన్స్ వద్ద ముంబై తొలి వికెట్ కోల్పోయింది. ఇషాన్ కిషన్(14) క్రీజులో ఉన్నాడు.
-
24 May 2023 07:40 PM (IST)
సిక్స్‌తో ఖాతా తెరిచిన రోహిత్
రోహిత్ శర్మ(11) సిక్స్‌తో ఖాతా తెరిచాడు. కృనాల్ పాండ్యా ఓవర్లో తొలి బంతిని లాంగాన్‌లో స్టాండ్స్‌లోకి పంపాడు. మూడో బంతికి ఫోర్ బాదాడు. నాలుగో బాల్‌కు బైస్ రూపంలో 4 రన్స్ వచ్చాయి. ఇషాన్ కిషన్(14) క్రీజులో ఉన్నాడు. మూడు ఓవర్లకు స్కోర్.. 29/0
-
24 May 2023 07:37 PM (IST)
ఇషాన్ దూకుడు
కృష్ణప్ప గౌతమ్ నాలుగు డాట్ బాల్స్ వేశాడు. ఆఖరి రెండు బంతులకు ఇషాన్ కిషన్(13) రెండు ఫోర్లు కొట్టాడు. 8 పరుగులు వచ్చాయి. రోహిత్ శర్మ(0) క్రీజులో ఉన్నాడు. రెండు ఓవర్లకు స్కోర్.. 13/0
-
24 May 2023 07:33 PM (IST)
తొలి ఓవర్లో 5 రన్స్
కృనాల్ పాండ్యా వేసిన తొలి ఓవర్లో ఇషాన్ కిషన్(5) రెండో బంతికే ఫోర్ కొట్టాడు. 5 పరుగులు వచ్చాయి. రోహిత్ శర్మ(0) క్రీజులో ఉన్నాడు.
-
24 May 2023 07:13 PM (IST)
తుది జట్టులో ఎవరంటే..
ముంబై జట్టు - ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ( కెప్టెన్ ), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, నేహల్ వధేరా, క్రిస్ జోర్డాన్, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, జేసన్ బెహ్రన్‌డార్ఫ్. ఆకాశ్ మధ్వాల్.
లక్నో జట్టు - ఆయుశ్ బదోని, దీపక్ హుడా, ప్రేరక్ మన్కడ్, స్టోయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, కృష్ణప్ప గౌతమ్, రవి బిష్ణోయ్, నవీన్ ఉల్ హక్, యశ్ ఠాకూర్, మొహ్సిన్ ఖాన్.
-
24 May 2023 07:04 PM (IST)
టాస్ గెలిచిన ముంబై
టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ తీసుకున్నాడు. దాంతో లక్నో మొదట బౌలింగ్ చేయనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

