42 బంతుల్లో లివింగ్‌స్టోన్ మెరుపు సెంచరీ.. అయినా ఓడిన ఇంగ్లండ్

టెంట్ బ్రిడ్జ్: లియామ్ లివింగ్‌స్టోన్ కళ్లు చెదిరే సెంచరీ చేసినా.. ఇంగ్లండ్‌కు విజయం దక్కలేదు. పాకిస్థాన్‌తో జరిగిన తొలి టీ20లో ఆ జట్టు 31 రన్స్ తేడాతో ఇంగ్లండ్‌పై నెగ్గింది. 233 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు.. లివింగ్‌స్టోన్ ఆశాకిరణంలా కనిపించాడు. భారీ షాట్లతో అతను హోరెత్తించాడు. కేవలం 17 బంతుల్లో 50 రన్స్ పూర్తి చేసుకున్నాడు. 42 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఇంగ్లండ్ టీ20 చరిత్రలో ఇది కొత్త రికార్డు. 9 సిక్సర్లతో లివింగ్‌స్టోన్ 43 బంతుల్లో 106 రన్స్ చేసి కీలకదశలో ఔటయ్యాడు. దీంతో ఇంగ్లండ్ 19.2 ఓవర్లలో 201 రన్స్ చేసి ఆలౌటైంది. అంతకముందు పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ దుమ్మురేపారు. 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 232 రన్స్ చేశారు. పాక్ ఇన్నింగ్స్‌లో బాబర్ 85, రిజ్వాన్ 63 రన్స్ చేసి స్కోర్ బోర్డును పరుగెత్తించారు. పాకిస్థాన్‌కు టీ20 క్రికెట్లో ఇదే హయ్యెస్ట్ స్కోరు. ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌లో 3-0 తేడాతో పాక్ ఓడిన విషయం తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘స్పెషల్’ పెట్టకుండానే బాదుడు.. బస్ పాయింట్లలో కనిపించని రెగ్యులర్ బస్సులు!
Cyber Attack | సైబర్ ‘సెక్యూరిటీ’ ఏది?.. రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లపై యథేచ్ఛగా దాడులు
పాడి, కోళ్ల పరిశ్రమపై కరువు పంజా.. పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ స్పెషల్ ఇంటర్వ్యూ
Stock Market Tips | స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి
Israel Elections | నెతన్యాహు భవితవ్యం ఏంటో.. రేపే ఇజ్రాయెల్ పార్లమెంట్ ఎన్నికలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

