బ్రెజిల్ కమాల్.. పోరాడి ఓడిన జపాన్
సాకర్ ప్రపంచకప్‌లో ఐదుసార్లు చాంపియన్ బ్రెజిల్ మరోసారి స్థాయికి తగ్గ ప్రదర్శనతో దుమ్మరేపింది. టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగి గ్రూప్ దశలో రెండు విజయాలతో నాకౌట్‌కు చేరిన సాంబా జట్టు.. రౌండ్ ఆఫ్ -32లోనూ సత్తాచాటింది. సోమవారం రాత్రి హోస్టన్ స్టేడియం వేదికగా జపాన్‌తో ఆఖరివరకూ రసవత్తరంగా సాగిన పోరులో 2-1తో ప్రత్యర్థిని చిత్తుచేసి ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధించింది.
- కెనడా ముందంజ
- యూస్టాకియో లేట్ గోల్‌తో ప్రిక్వార్టర్స్‌కు
హోస్టన్ (టెక్సాస్) : సాకర్ ప్రపంచకప్‌లో ఐదుసార్లు చాంపియన్ బ్రెజిల్ మరోసారి స్థాయికి తగ్గ ప్రదర్శనతో దుమ్మరేపింది. టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగి గ్రూప్ దశలో రెండు విజయాలతో నాకౌట్‌కు చేరిన సాంబా జట్టు.. రౌండ్ ఆఫ్ -32లోనూ సత్తాచాటింది. సోమవారం రాత్రి హోస్టన్ స్టేడియం వేదికగా జపాన్‌తో ఆఖరివరకూ రసవత్తరంగా సాగిన పోరులో 2-1తో ప్రత్యర్థిని చిత్తుచేసి ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధించింది. బ్రెజిల్ తరఫున కెస్మిరొ (56వ నిమిషంలో), గాబ్రియెల్ మార్టినెల్లి (90+5 వ) చెరో గోల్ చేయగా జపాన్ నుంచి కైషు సానొ (29వ) ఏకైక గోల్ సాధించాడు. తొలి అర్ధభాగంలో జపాన్ అంచనాలకు మించి రాణించి ప్రత్యర్థిని నిలువరించినా సెకండాఫ్‌లో సాంబా టీమ్ రెచ్చిపోయింది. ప్రత్యర్థిపై ఎదురుదాడికి దిగిన ఆ జట్టు కెస్మిరొ గోల్‌తో స్కోర్లను సమం చేసింది. నిర్ణీత సమయంలో 1-1తో స్కోర్లు సమం కాగా ఇంజురీ టైమ్‌లో బ్రూనో గైమెరియస్ ఇచ్చిన పాస్‌ను గాబ్రియెల్ గోల్ చేసి బ్రెజిల్‌ను ప్రిక్వార్టర్స్ చేర్చాడు.
కెనడా జోరు
ఫిఫా ప్రపంచకప్‌లో సహ ఆతిథ్య దేశంగా ఉన్న కెనడా తమ జోరు కొనసాగిస్తున్నది. సాకర్ వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి నాకౌట్ దశకు అర్హత సాధించిన ఆ జట్టు.. మరో సంచలన ప్రదర్శనతో సౌతాఫ్రికాను చిత్తుచేసి రౌండ్ ఆఫ్-16కు దూసుకెళ్లింది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం ఉత్కంఠగా సాగిన పోరులో కెనడా.. 1-0తో సఫారీలను ఓడించి ప్రిక్వార్టర్స్ బెర్తును దక్కించుకుంది. నిర్ణీత సమయంలో ఇరుజట్లూ గోల్స్ చేయడంలో విఫలమవగా ఎక్స్ట్రా టైమ్‌లో కెనడా స్టార్ మిడ్‌ఫీల్డర్ స్టీఫెన్ యూస్టాకియొ 90+2వ నిమిషంలో గోల్ కొట్టి తన జట్టుకు మరో మరుపురాని విజయాన్ని అందించాడు. ఈ ఓటమితో ఫిఫా చరిత్రలో తొలిసారి నాకౌట్ దశకు చేరిన దక్షిణాఫ్రికా రౌండ్ ఆఫ్ -32లోనే ఇంటిబాట పట్టగా ప్రిక్వార్టర్స్‌లో కెనడా.. నెదర్లాండ్స్, మొరాకో మ్యాచ్‌లో విజేతతో తలపడుతుంది.

స్టీఫెన్ మ్యాజిక్‌తో..
తొలిసారి నాకౌట్ ఆడుతున్న ఇరుజట్లూ తమ ప్రత్యర్థులను గోల్ చేయకుండా నిలువరించడంలో విజయంతమయ్యాయి. మ్యాచ్‌లో కెనడాతో పోలిస్తే బంతిని ఎక్కువభాగం తమ నియంత్రణలోనే ఉంచుకున్న దక్షిణాఫ్రికా.. గోల్ చేయడంలో మాత్రం విఫలమైంది. అయితే సఫారీల డిఫెన్స్‌ను ఛేదించుకుంటూ కెనడా పలుమార్లు వారి గోల్‌పోస్ట్‌పై దాడులకు దిగింది. కానీ దక్షిణాఫ్రికా గోల్‌కీపర్ రొన్వెన్ విలియమ్స్.. కెనడాకు అడ్డుగోడగా నిలిచి ఐదుసార్లు ఆ జట్టుకు నిరాశే మిగిల్చాడు. 75వ నిమిషంలో కెనడా తమ తురుపుముక్క స్టార్ డిఫెండర్ అల్ఫాన్సొ డెవిస్‌ను బరిలోకి దించినా అవకాశాలను సృష్టించుకోలేకపోయింది. లాస్ ఏంజెల్స్ స్టేడియంలో 90 నిమిషాల గోల్స్లేమితో విసిగిపోయిన అభిమానులకు ఎక్స్ట్రా టైమ్‌లో స్టీఫెన్ మ్యాజిక్ చేశాడు. అలిస్టర్ జాన్స్టన్ ఇచ్చిన లాంగ్‌పాస్‌ను అందుకున్న అతడు.. బాక్స్ వెలుపలి నుంచి నేరుగా కొట్టిన బంతి గోల్ పోస్ట్‌ను ముద్దాడటంతో కెనడా అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
వరల్డ్ కప్‌లో నేడు
నెదర్లాండ్స్ x మొరాకో ఉ. 6.30 నుంచి
ఐవరీ కోస్ట్ x నార్వే రా. 10.30 నుంచి
ఫ్రాన్స్ x స్వీడన్ తె.జా. 2.30 నుంచి
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కెమిస్ట్రీ వెంకటేశ్వరరావు మృతి కోదాడ పబ్లిక్ క్లబ్‌కు తీరని లోటు’
‘బతుకమ్మ పండుగ ఏర్పాట్లలో వివక్షత తగదు’
Gurugram | బర్త్‌డే నాడే భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న ఐటీ ఉద్యోగి.. చివరగా కంపెనీకి మెయిల్
Boys Kill Friend | బైక్, బర్త్ డే వేడుకకు డబ్బు కోసం.. స్నేహితుడ్ని హత్య చేసిన ఇద్దరు బాలురు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

