మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా కోహ్లి, రోహిత్‌లకు కష్టమే!

ముంబై: వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో సరైన మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా బరిలోకి దిగడం విరాట్ కోహ్లి, రోహిత్ శర్మను ఇబ్బంది పెడుతుందని అన్నాడు మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్. మరోవైపు ప్రత్యర్థి న్యూజిలాండ్ మాత్రం ఈ ఫైనల్‌కు ముందు ఇంగ్లండ్‌తో రెండు టెస్టులు ఆడుతుండటం వాళ్లకు కలిసొచ్చే అంశమని అభిప్రాయపడ్డాడు. కోహ్లి, రోహిత్ మంచి ఫామ్‌లో ఉన్నా కూడా.. ఈ మధ్య కాలంలో టెస్టుల్లో మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం వాళ్లను ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నదని వెంగ్‌సర్కార్ అన్నాడు.
కోహ్లి చాలా కాలంగా ఆడుతున్నాడు. ప్రపంచ క్రికెట్లో బెస్ట్ బ్యాట్స్‌మెన్‌లో కోహ్లి ఒకడు. కోహ్లి, రోహిత్‌లాంటి వాళ్లు వరల్డ్ క్లాస్ ప్లేయర్స్. వాళ్లిద్దరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. కానీ మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం మాత్రం ఫైనల్లో వాళ్లను ఇబ్బంది పెడుతుందని నేను భావిస్తున్నాను అని వెంగ్‌సర్కార్ అన్నాడు.
ఈ ఫైనల్‌కు ముందు ఇంగ్లండ్‌తో రెండు టెస్టులు ఆడుతుండటం న్యూజిలాండ్‌కు కలిసొస్తుందని, ఇది ఒకరకంగా ఆ టీమ్‌ను ఇండియా కంటే కాస్త ముందు నిలబెట్టిందని అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్ పరిస్థితులకు అలవాటు పడటానికి ఈ మ్యాచ్‌కు ముందు ఇండియా కనీసం రెండు, మూడు మ్యాచ్‌లు ఆడితే బాగుండేదని వెంగ్‌సర్కార్ అన్నాడు. నెట్ ప్రాక్టీస్ ఎంత చేసినా.. మ్యాచ్ ప్రాక్టీస్ ఉండటం అన్నది చాలా ముఖ్యమని స్పష్టం చేశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

