SRH vs KKR : అదిరే ఆటతో వరస విజయాలతో దూసుకెళ్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) కల చెదిరింది. డబుల్ హ్యాట్రిక్‌తో టేబుల్ టాపర్ అవ్వాలనుకున్న కమిన్స్ సేనకు కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) బిగ్ షాకిచ్చింది. మిస్టరీ స్పిన్నర్లు తిప్పేయడంతో హిట్టర్లతో నిండిన హైదరాబాద్‌ను 165 పరుగుల వద్దే ఆపిన కోల్‌కతా రఘువంశీ(59), సారథి అజింక్యా రహానే(43)ల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. వైస్ కెప్టెన్ రింకూ సింగ్(18 నాటౌట్) లాంఛనం ముగించడంతో కోల్‌కతా మూడో విజయంతో మురిసింది.
పంతొమ్మిదో సీజన్లో చెలరేపోతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జోరుకు కోల్‌కతా నైట్ రైడర్స్ బ్రేకులు వేసింది. ఉప్పల్ స్టేడియంలో బ్యాటర్లు తేలిపోవడంతో తక్కువ స్కోర్ కొట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను బౌలర్లు కాపాడలేకపోయారు. స్వల్ప లక్ష్యాన్ని కోల్‌కతా ఆడుతూపాడుతూ ఛేదించింది. ఆరెంజ్ ఆర్మీని 165కే కట్టడి చేసిన కేకేఆర్‌కు ఓపెనర్లు శుభారంభింమిచ్చారు.
IT WAS ALL HAPPENING THERE 😲
Probably the most action-packed over of the game with Finn Allen and Pat Cummins going against each other 👊🔥
RE-WATCH THE OVER ▶️ https://t.co/UNuRxg9x1f#TATAIPL | #KhelBindaas | #SRHvKKR pic.twitter.com/WaHRMCu2yc
— IndianPremierLeague (@IPL) May 3, 2026
ఫిన్ అలెన్(29), అజింక్యా రహానే(43)లు ఎడాపెడా దంచేశారు. నాలుగో ఓవర్లో అలెన్ ఊచకోతకు బలైన కమిన్స్ 27 పరుగులిచ్చుకున్నాడు. కానీ, చివరి బంతికి అతడి వికెట్ తీసి ఊపిరి పీల్చుకున్నాడు. అనంతరం వచ్చిన రఘువంశీ(59) కెప్టెన్‌తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించాడు. అర్ధ శతకం భాగస్వామ్యంతో జట్టు విజయానికి బాటలు వేశారిద్దరు.
5️⃣0️⃣ UP!
Angkrish Raghuvanshi with a steady half century, inching #KKR closer 👏
Updates ▶️ https://t.co/muersQO7at#TATAIPL | #KhelBindaas | #SRHvKKR pic.twitter.com/os23Ll7zNX
— IndianPremierLeague (@IPL) May 3, 2026
కోల్‌కతాను గెలుపు దిశగా నడిపించిన ఈ జోడీని విడదీసేందుకు సన్‌రైజర్స్ సారథి కమిన్స్ బౌలర్లను మార్చినా ఫలితం లేకపోయింది. జట్టు విజయానికి 33 రన్స్ అవసరమైన వేళ షకీబ్ ఓవరర్లో రహానే ఔటయ్యాడు. కాసేపటికే రఘువంశీని శివాంగ్ వెనక్కి పంపాడు. అప్పటికే లక్ష్యం కరిగిపోగా.. వైస్ కెప్టెన్ రింకూ సింగ్(18 నాటౌట్), గ్రీన్(3 నాటౌట్) లాంఛనం ముగించారు. దాంతో, వరసగా ఆరో విజయంతో టాప్‌లోకి దూసుకెళ్లాలనుకున్న హైదరాబాద్ ఆశలు ఆడియాశలయ్యాయి.
సొంతగడ్డపై భారీ స్కోర్‌తో కోల్‌కతాను భయపెట్టాలనుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ అనూహ్యంగా తడబడింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్(61) మెరుపు అర్ధ శతకతో భారీ స్కోర్‌కు పునాది వేసినా.. మిడిలాడ్డర్ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు.
ఇషాన్ కిషన్(42) నిలబడినా అతడికి సహకరించేవాళ్లు కరువయ్యారు. మిస్టరీ స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి(3-36), సునీల్ నరైన్(2-31)లు వికెట్ల వేటతో సన్‌రైజర్స్ హిట్లర్లకు కళ్లెం వేశారు. ఇంకేముంది.. 48 పరుగుల వ్యవధిలో 8 వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ 165కే ఆలౌటయ్యింది.
ట్రావిస్ హెడ్(61), ఇషాన్ కిషన్(42)
