KL Rahul : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్లో భారీ శతకంతో మెరిసిన కేఎల్ రాహుల్(KL Rahul) పొట్టి క్రికెట్లో సంచలనంగా మారాడు. ఢిల్లీ క్యాపిటల్స్ విజయాల్లో కీలకమవుతూ నిఖార్సైన టీ20 బ్యాటర్‌గా ప్రశంసలు అందుకుంటున్న రాహుల్.. తనను తాను టీ20 బ్యాటర్ అని ఎప్పుడూ అనుకోలేదని బాంబ్ పేల్చాడు. మంగళవారం సొంతడ్డపై చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌కు ముందు ఈ డాషింగ్ బ్యాటర్ టెస్టు ఆటగాడిగా తనపై పడిన ముద్ర నుంచి బయటపడిన తీరును పంచుకున్నాడు.
పంతొమ్మిదో సీజన్లో దంచేస్తున్న కేఎల్ రాహుల్ పదేళ్ల క్రితం నాటి రోజులను గుర్తు చేసుకున్నాడు. ఒకప్పుడు తాను టెస్టు ప్లేయర్‌గానే కొనసాగానని.. కానీ, ఇప్పుడు టీ20ల్లో రాణిస్తున్నాని చెప్పాడు. సీఎస్కేతో మ్యాచ్‌కు ముందు జియోస్టార్ సూపర్ స్టార్స్ షోలో మాట్లాడిన రాహుల్.. ‘పదేళ్ల క్రితం నేను టీ20 జట్టులో చోటుకు కొంత దూరంలో కూడా లేను. నాకు నేను టీ20 బ్యాటర్ అని ఎప్పుడూ భాచించలేదు. అదే సమయంలో వైట్ బాల్ క్రికెట్లో మంచి ప్లేయర్‌ను అని కూడా అనుకోలేదు.
ఎందుకంటే నాపై టెస్టు క్రికెటర్ అనే ముద్ర ఉండేది. అయితే.. మిగిలిన ఫార్మాట్లలోనూ నిరూపించుకునేందుకు నేను వైట్‌బాల్ ఆటపై దృష్టి పెట్టాను. ఇప్పుడు ఈస్థాయికి చేరుకోవడం గర్వంగా ఉంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నేను తప్పులు చేశాను. అదే సమయంలో కొన్ని చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడాను’ అని పేర్కొన్నాడు.
“Most Beautiful Thing For Me”: KL Rahul’s Heartfelt Revelation After Embracing Fatherhood#KLRahul #IPL2026 https://t.co/vmZLl31nX1
— CricketNDTV (@CricketNDTV) May 5, 2026
అంతేకాదు తండ్రిగా తనలో చాలా మార్పులు వచ్చాయని చెప్పాడు రాహుల్. ‘తండ్రిని అవ్వడం నా జీవితంలో జరిగిన అద్భుతమైన విషయం. నేను ఎల్లప్పుడూ ప్రశాంతంగా, సంతోషంగా ఉంటానని అనుకునేవాడిని. కానీ, నేను పొరబడ్డాను. మన బిడ్డను చేతిలోకి తీసుకున్నప్పుడే మనం నిజంగా చాలా సంతోషంగా, ప్రశాంతంగా ఉంటామని గ్రహించాను.
KL Rahul has upped his game in #IPL2026 🔥 pic.twitter.com/XjujSTro8c
— Cricbuzz (@cricbuzz) May 5, 2026
మా పాప నవ్వు చూసినా.. తను నాకు ముద్దు పెట్టినా, హగ్ ఇచ్చినా.. గాయాలు, నొప్పులు, బాధలు అన్నీ మర్చిపోతాను. తండ్రినయ్యక నా క్రికెట్ మరింత మెరుగుపడింది’ అని చెప్పిన రాహుల్ 2022 నుంచి భారత టీ20 జట్టుకు దూరమైన అతడు.. వన్డే, టెస్టుల్లో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఐపీఎల్ 19వ సీజన్లో బ్యాట్ ఝులిపిస్తున్న రాహుల్ 9 ఇన్నింగ్స్‌ల్లో 185.84 స్ట్రయిక్ రేటుతో 433 పరుగులు చేశాడు.