పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో యూఎస్ ఓపెన్ చాంపియన్ ఎమ్మా రెడుకాను నిష్క్రమించగా.. బెలారస్ స్టార్ ప్లేయర్ అజరెంకా దూకుడు కనబర్చింది. మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో కెనడా టెన్నిస్ స్టార్ ఎమ్మా 6-3, 1-6, 1-6తో అలియాక్సాండ్ర సస్నోవిచ్ (బెల్జియం) చేతిలో ఓటమిపాలైంది. తొలి సెట్‌ను చేజిక్కించుకున్న ఎమ్మా.. తర్వాతి రెండు సెట్లను పోరాడకుండానే చేజార్చుకుంది.
రెండు సార్లు గ్రాండ్‌స్లామ్ విజేత విక్టోరియా అజరెంకా 6-1, 7-6 (3)తో ఆండ్రే పెట్కోవిచ్ (జర్మనీ)పై నెగ్గి మూడో రౌండ్లోకి ప్రవేశించింది. మరో పోరులో అమెరికా టీనేజర్ కోకో గాఫ్ 6-1, 7-6 (4)తో అలిసన్ వాన్ ఉత్వాంక్ (బెల్జియం)ను చిత్తు చేసి తర్వాతి రౌండ్లోకి దూసుకెళ్లింది. పురుషుల పోరులో టాప్‌సీడ్ నోవాక్ జొకోవిచ్, అల్కారజ్, దిమిత్రోవ్, అల్లిసిమీ, జ్వెరెవ్, నోరి ముందంజ వేశారు. రెండో రౌండ్లో జొకో 6-2, 6-3, 7(7)-6(4)తో అలెక్స్ మోల్కన్ (స్లోవేకియా)ను చిత్తు చేశాడు.
కరోనా కలకలం
ఈ టోర్నీలో కరోనా వైరస్ కలకలం రేపింది. చెక్ రిపబ్లిక్ ప్లేయర్ మేరి బౌజ్కోవాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆమె టోర్నీ నుంచి వైదొలిగింది.