Jos Buttler | చాహల్ భార్యతో స్టెప్పులేసిన బట్లర్.. వైరల్ అవుతున్న వీడియో
ఈ ఏడాది ఐపీఎల్లో అద్భుతంగా రాణించిన జట్లలో రాజస్థాన్ రాయల్స్ ఒకటి. ఐపీఎల్ తొలి సీజన్లో ట్రోఫీ నెగ్గిన ఆ జట్టు.. ఆ తర్వాత చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రదర్శన చేయలేదు. అలాంటిది 14 ఏళ్ల తర్వాత మళ్లీ ఫైనల్ చేరింది. ఈసారి ఎలాగైనా కప్పు కొడుతుందని అనుకున్నా.. గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమి పాలైంది.
అయితే ఆ జట్టు ఆటగాళ్లు జోస్ బట్లర్, యుజ్వేంద్ర చాహల్ తమ ఆటతీరుతో అందరినీ ఆకట్టుకున్నారు. బ్యాటుతో చెలరేగిన బట్లర్ ఆరెంజ్ క్యాప్ సాధించగా.. బంతితో మాయ చేసిన చాహల్ పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో చాహల్ భార్య ధనశ్రీ.. వీళ్లిద్దరికీ బాలీవడ్ డ్యాన్స్ నేర్పించడానికి ప్రయత్నించింది. భార్య చేస్తున్న డ్యాన్స్ తన వల్ల కాక చాహల్ మధ్యలోనే వదిలేసినా.. బట్లర్ మాత్రం చాలా కష్టపడి ఆమె మూవ్మెంట్స్ కాపీ చేయడానికి ప్రయత్నించాడు.
చివర్లో ముగ్గురూ కూడా చాహల్ స్టైల్లో నేలపై పడుకొని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన ధనశ్రీ.. ‘‘ఆరెంజ్, పర్పుల్ మధ్యలో పింక్’’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

