ICC Test Rankings | ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల.. నెంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా జో రూట్.. బౌలర్‌గా జస్ప్రీత్ బుమ్రా..!
ICC Test Rankings | ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌ను బుధవారం విడుదల చేసింది. ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ జో రూట్ ఐసీసీ నెంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఇక టాప్ టెన్‌లో ముగ్గురు భారత ఆటగాళ్లు ఉన్నారు. లార్డ్స్ టెస్టులో వీరోచితంగా పోరాటం చేసిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 34వ స్థానానికి చేరుకున్నాడు.
ICC Test Rankings | ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌ను బుధవారం విడుదల చేసింది. ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ జో రూట్ ఐసీసీ నెంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఇక టాప్ టెన్‌లో ముగ్గురు భారత ఆటగాళ్లు ఉన్నారు. లార్డ్స్ టెస్టులో వీరోచితంగా పోరాటం చేసిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 34వ స్థానానికి చేరుకున్నాడు. లార్డ్స్‌లో భారత్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో ఇంగ్లండ్ 22 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లిష్ ప్లేయర్ జో రూట్ తొలి ఇన్నింగ్స్‌లో 104, రెండో ఇన్నింగ్స్‌లో 40 పరుగులు చేయడంతో టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం అతని ఖాతాలో 888 పాయింట్లు ఉన్నారు. ఇక మరో ఇంగ్లండ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ రెండుస్థానాలు దిగజారి మూడోస్థానానికి పడిపోయాడు.
న్యూజిలాండ్ సీనియర్ ప్లేయర్ కేన్ విలియమన్స్ రెండోస్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక టీమిండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ ఒక స్థానం దిగజారి ఐదోస్థానానికి చేరుకున్నాడు. సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా ఆరు, శ్రీలంక ప్లేయర్ కమిందు మెండిస్ ఏడు, టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ ఎనిమిది, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తొమ్మిదో స్థానాల్లో ఉన్నారు. పంత్ ఒక స్థానం, గిల్ మూడుస్థానాలు దిగజారాడు. ఇక పదో స్థానంలో ఇంగ్లండ్ ప్లేయర్ జేమీ స్మిత్ పదో స్థానంలో నిలిచాడు. అయితే, లార్డ్స్‌లో 72 పరుగులు, 61 నాటౌట్‌గా నిలిచిన జడేజా ఐదు స్థానాలు ఎగబాకి 34వ స్థానానికి చేరుకున్నాడు.
ఇదే మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 100, సెకండ్ ఇన్నింగ్స్‌లో 39 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ కూడా ఐదు స్థానాలు ఎగబాకి 35వ స్థానంలో ఉన్నాడు. లార్డ్స్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ 77 పరుగులకు ఐదు వికెట్లు సాధించి, బ్యాట్స్‌మెన్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలువడంతో రెండుస్థానాలు ఎగబాకి 42వ స్థానానికి చేరుకున్నాడు. ఇక బౌలర్ల ర్యాంకింగ్స్ టీమిండియా మిస్టరీ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా నెంబర్ వన్ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం బుమ్రా ఖాతాలో 901 పాయింట్లు ఉన్నాయి. ఇక దక్షిణాఫ్రికాకు చెందిన కగిసో రబాడా రెండోస్థానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ స్కాట్ బోలాండ్ గణనీయంగా ఎగబాకి ఆరు స్థానాలు ఎగబాకి కెరీర్లో అత్యుత్తమంగా ఆరో స్థానానికి చేరుకున్నాడు.
టెస్ట్ క్రికెట్లో 62 వికెట్లు 16.53 సగటుతో వికెట్లు తీసిన బోలాండ్.. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమర్స్ జార్జ్ లోహ్మాన్, సిడ్నీ బార్న్స్ మాత్రమే మెరుగైన సగటుతో వికెట్లు పడగొట్టారు. ఇప్పటికే టాప్-10లో ఆస్ట్రేలియా ప్లేయర్లు పాట్ కమ్మిన్స్, జోష్ హాజిల్‌వుడ్, నాథన్ లియాన్, మిచెల్ స్టార్క్‌లతో ఐసీసీ ర్యాంకింగ్స్ టాప్ టెన్‌లో చోటు దక్కించుకున్నాడు. 1958లో ఇంగ్లండ్ జట్టు టాప్ 12లో ఆరుగురు బౌలర్లు ఉండగా.. తాజాగా ఐదుగురు ఆస్ట్రేలియా బౌలర్లు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకున్నారు. ఇక టీమిండియా ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ 58వ స్థానం నుంచి 46వ స్థానానికి చేరుకున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

