Kylian Mbappe | అతడి భవిష్యత్ ఏంటో అతడికే తెలియదు.. మరి నేనెలా చెప్పగలను..?
Kylian Mbappe : ఫ్రాన్స్ స్టార్ ఫుట్‌బాలర్ కిలియన్ ఎంబాపే (Kylian Mbappe) కొత్త క్లబ్‌కు మారడంపై ఇంకా స్పష్టత రాలేదు. పారిస్ సెయింట్ జర్మనీ (PSG) క్లబ్‌ను వీడి త్వరలోనే రియల్ మాడ్రిడ్(Real Madrid)కు మారతడానే వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో జర్మన్ ఫుట్‌బాలర్...
Kylian Mbappe : ఫ్రాన్స్ స్టార్ ఫుట్‌బాలర్ కిలియన్ ఎంబాపే (Kylian Mbappe) కొత్త క్లబ్‌కు మారడంపై ఇంకా స్పష్టత రాలేదు. పారిస్ సెయింట్ జర్మనీ (PSG) క్లబ్‌ను వీడి త్వరలోనే రియల్ మాడ్రిడ్(Real Madrid)కు మారతడానే వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో జర్మన్ ఫుట్‌బాలర్ టోనీ క్రూస్(Toni Kroos) ఫ్రాన్స్ మిడ్‌ఫీల్డర్ భవితవ్యంపై సరదా వ్యాఖ్యలు చేశాడు. ‘ఎంబాపేకు తన భవిష్యత్ ఏంటో తెలియదు. అలాంటప్పుడు నాకెలా తెలుస్తుంది?’ అని క్రూస్ జోక్ చేశాడు.
అంతేకాదు ‘మాడ్రిక్ జట్టులో అత్యుత్తమ ఆటగాడు ఉండాలి అనుకుంటున్నాం. అందుకు ఎంబాపే సరైనోడు అందులో ఎలాంటి సందేహం లేదు’ అని క్రూస్ వెల్లడించాడు. ఈ ఏడాది జూన్ 30వ తేదీన పీఎస్జీతో ఎంబాపే కాంట్రాక్ట్ ముగియనుంది. అప్పుడే అతడు రియల్ మాడ్రిక్ క్లబ్లో చేరే అవకాశముంది.

ప్రపంచంలోని మేటి ఫుట్‌బాలర్‌గా ఎదుగుతున్న ఎంబాపే.. 2007లో మొనాకో క్లబ్ నుంచి పీఎస్జీలో చేరాడు. అప్పటి నుంచి ఇప్పటివరకూ అదే క్లబ్‌తో కొనసాగుతున్నాడు. అయితే.. గత కొన్ని నెలలుగా ఎంబాపే.. పీఎస్జీ యాజమాన్యం వైఖరితో అసంతృప్తిగా ఉన్నాడు. దాంతో, అతడు ఆ క్లబ్‌ను వీడేందుకు సిద్ధమయ్యాడు.

హ్యాట్రిక్ గోల్స్
ఖతర్ వేదికగా 2022 జరిగిన ఫిఫా వరల్డ్ కప్‌లో ఎంబాపే అదరగొట్టాడు. ఫైనల్లో హ్యాట్రిక్ గోల్స్(Hat-trick Goals) కొట్టి అర్జెంటీనా(Arjentina)ను వణికించాడు. కానీ, షూటౌట్లో 2-4తో ఫ్రాన్స్ ఓటమి పాలైంది. ఆ టోర్నీలో అత్యధికంగా 8 గోల్స్ కొట్టిన అతడికి ‘గోల్డెన్ బూట్’ అవార్డు లభించింది.
ఇవి కూడా చదవండి
- IPL 2024 | ఢిల్లీ పేస్‌గుర్రం ఎంట్రీ.. టీమ్ హోటల్లో ఘన స్వాగతం.. వీడియో వైరల్
- Sanjay Raut | అరవింద్ కేజ్రీవాల్‌ను చూసి మోదీ భయపడుతున్నారు : సంజయ్ రౌత్
- Congress Party | కాంగ్రెస్ పార్టీకి షాక్.. భార్యకు టికెట్ ఇవ్వలేదని ఎమ్మెల్యే రాజీనామా
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’కి చిక్కులు.. నేతాజీ చరిత్రను వక్రీకరించారంటూ దర్శకుడిపై విమర్శలు!
Rahul Gandhi: అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు.. పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ నిర్దోషి
Dhanush | ధనుష్ రాజకీయాల్లోకి రావడం ఖయమా.. విజయ్ పార్టీ నేతలు అప్పుడే సెటైర్స్ స్టార్ట్ చేశారుగా..!
పెద్దవాగులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలి : ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
Health Tips | స్వీట్లు తినడం మానేసినా షుగర్ లెవల్స్ తగ్గడం లేదా.. అయితే కారణం ఇదే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

