Congress Party | కాంగ్రెస్ పార్టీకి షాక్.. భార్యకు టికెట్ ఇవ్వలేదని ఎమ్మెల్యే రాజీనామా
Congress Party | తన భార్యకు ఎంపీ టికెట్ ఇవ్వలేదని ఓ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ పరిణామం అసోంలో చోటు చేసుకుంది.
Congress Party | దిస్పూర్ : తన భార్యకు ఎంపీ టికెట్ ఇవ్వలేదని ఓ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ పరిణామం అసోంలో చోటు చేసుకుంది. లఖింపూర్ జిల్లాలోని నౌబోయిచా నియోజకవర్గ ఎమ్మెల్యే భరత్ చంద్ర నారా.. తన భార్య రాణి నారాకు లోక్‌సభ టికెట్ నిరాకరించడంతోనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పంపారు.
భరత్ చంద్ర నారా రాజీనామాను అసోం సీఎల్పీ నాయకుడు దేబబ్రత సైకియా ధ్రువీకరించారు. అంతకుముందు నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. సీఎం హిమంత బిస్వా శర్మ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. వీరిలో ఒక ఎమ్మెల్యే షెర్మాన్ అలీ అమ్మద్ సస్పెండ్ అయ్యారు. మిగిలిన ఎమ్మెల్యేలు శశికాంత దాస్, సిద్ధిక్ అహ్మద్, కమలాఖ్య డే పుర్కాయస్థ, బసంత దాస్‌లు మాత్రం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలేదు.
అసోంలోని 14 లోక్‌సభ నియోజకవర్గాలకు మూడు దశల్లో ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7వ తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. 2019 ఎన్నికల్లో బీజేపీ 9 స్థానాల్లో, కాంగ్రెస్ మూడు స్థానాల్లో గెలుపొందాయి. ఏఐయూడీఎఫ్ ఒక్క సీటును మాత్రమే గెలుచుకుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gujarat: వీహెచ్‌పీ డిమాండ్‌తో.. ప్రభుత్వ మ్యాగ్జిన్ నుంచి వివాదాస్పద కవిత తొలగింపు
Jailer 2 | జైలర్ 2 బాక్సాఫీస్ సునామీ.. 11 రోజుల్లోనే రూ.700 కోట్లకు పైగా వసూళ్లు!
వాల్మీకి మహర్షి జీవితం పట్టుదలకు మారు పేరు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
North Block: ఢిల్లీ నార్త్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం.. అదపులోకి మంటలు
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’కి చిక్కులు.. నేతాజీ చరిత్రను వక్రీకరించారంటూ దర్శకుడిపై విమర్శలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

