Mike Tyson Vs Jake Paul: జేక్ పౌల్ పంచ్‌లకు మైక్ టైసన్ ఔట్..
Mike Tyson Vs Jake Paul: టైసన్ పంచ్‌లో పవర్ తగ్గింది. దీంతో ఐరన్ మైక్ ఓడిపోయాడు. జేక్ పౌల్ ఇచ్చిన పంచ్‌లకు మాజీ హెవీవెయిట్ ఛాంపియన్ చేతులెత్తేశాడు. ఏకపక్షంగా సాగిన బిగ్ బౌట్లో పౌల్ విజేతగా నిలిచాడు.
టెక్సాస్: ప్రపంచ మాజీ హెవీ వెయిట్ చాంపియన్ మైక్ టైసన్(Mike Tyson Vs Jake Paul) ఖంగుతిన్నాడు. ప్రత్యర్థి జేక్ పౌల్ ఇచ్చిన పంచ్‌లకు.. ఐరన్ మైక్ ఓడిపోయాడు. టెక్సాస్‌లో జరిగిన బిగ్ బౌట్లో.. 58 ఏళ్ల టైసన్ తన కన్నా 37 ఏళ్ల చిన్నోడైన జేక్ చేతిలో పరాజయాన్ని చవిచూశాడు. ఓ దశలో బాక్సింగ్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్న టైసన్.. ఈ ఫైట్ కోసం చాలా ప్రిపేరయ్యాడు. కానీ జేక్ విసిరిన పంచ్‌లకు బలయ్యాడు. టైసన్‌లో వేగం తగ్గినట్లు బాక్సింగ్ సీనియర్లు అంచనా వేశారు. అతని కాళ్లలో వేగం తగ్గినట్లు మ్యాచ్ ద్వారా అంచనా వేశారు. పంచ్‌లో కూడా పవర్ పడిపోయినట్లు భావించారు.
మొత్తం 8 రౌండ్ల మ్యాచ్‌లో టైసన్ పెద్దగా పర్పార్మ్ చేయలేకపోయాడు. ప్రతి రౌండ్ నిమిషాల పాటు సాగింది. జేక్ పౌల్ పంచ్‌లకు టైసన్ చాలా సార్లు దొరికిపోయాడు. గట్టిగా దెబ్బలు తగులుతున్నా.. వాటి తట్టుకుని టైసన్ ఎదురుదాడికి ప్రయత్నించాడు. ఏడవ రౌండ్లో టైసన్ కుడివైపు జేక్ పవర్ఫుల్ పంచ్ ఇచ్చాడు.
2005లో ప్రొఫెషనల్ బాక్సింగ్ నుంచి టైసన్ రిటైర్ అయిన విషయం తెలిసిందే. రింగ్‌లో అతను ఇప్పటి వరకు కేవలం ఆరుసార్లు మాత్రమే ఓడాడు. వయసుకు తగ్గ ఫైట్ కాకపోయినా.. టైసన్ మాత్రం తనలో దాగిన ఐరన్ గుండెను ప్రదర్శించాడు. 8వ రౌండ్ చివరలో టైసన్ ముందు తలవంచాడు పౌల్. అతనికి గ్లౌజ్‌లు ఇచ్చేశాడు టైసన్. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో పౌల్ విజేతగా నిలిచాడు.
ఓ జడ్జి 80-72 స్కోర్ ఇచ్చాడు. మరో ఇద్దరు జడ్జీలు 79-73 స్కోరుతో పౌల్‌కు విక్టరీని అందజేశారు. పౌల్ తన కెరీర్ రికార్డును పెంచుకున్నాడు. 12 మ్యాచుల్లో 11 బౌట్లను నెగ్గాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

