Ishan Kishan | ప్రాక్టీస్ మొదలెట్టిన ఇషాన్.. జట్టులోకి వచ్చేది అప్పుడేనా..?
Ishan Kishan : భారత యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్(Ishan Kishan) అభిమానులకు గుడ్‌న్యూస్. మూడు నెలలుగా ఆటకు దూరమైన ఈ డాషింగ్ ఓపెనర్ మళ్లీ మైదానంలో దిగాడు. మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టిన అతడు వికెట్ కీపింగ్...
Ishan Kishan : భారత యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్(Ishan Kishan) అభిమానులకు గుడ్‌న్యూస్. మూడు నెలలుగా ఆటకు దూరమైన ఈ డాషింగ్ ఓపెనర్ మళ్లీ మైదానంలో దిగాడు. మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టిన అతడు వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. వరల్డ్ కప్ తర్వాత దేశవాళీ క్రికెట్ (Domestic Cricket)తో పాటు ఇంగ్లండ్ సిరీస్‌కు దూరమైన అతడు బరోడా స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. అక్కడి కిరణ్‌మోరే అకాడమీ(Kiran More Academy)లో వికెట్ కీపింగ్‌లో రాటుదేలుతున్నాడు.
టీమిండియా ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలతో కలిసి ఈ యంగ్‌స్టర్ తన బ్యాటింగ్ స్కిల్స్‌ను మెరుగుపరుచుకుంటున్నాడు. ఈ విషయాన్ని తాజాగా మాజీ క్రికెటర్ కిరణ్‌మోరె వెల్లడించాడు. ‘అవును.. ఇషాన్ నా అకాడమీలోనే శిక్షణ తీసుకుంటున్నాడు. కొన్నిరోజులు విశ్రాంతి తీసుకున్న అతడు ఆటపై దృష్టి పెడుతున్నాడు’ అని మోరె తెలిపాడు. అయితే.. ఇషాన్ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఎప్పుడు ఆడుతాడు? అనేది మాత్రం తెలియాల్సి ఉంది.
ఇషాన్ కిషన్

ఐపీఎల్లో ధనాధన్ ఇన్నింగ్స్‌ల ఆడిన ఇషాన్.. టీమిండియా ఓపెనర్‌గానూ సత్తా చాటాడు. వెస్టిండీస్ పర్యటనలో వరుసగా నాలుగు హాఫ్ సెంచరీలతో రాణించాడు. అయితే.. వరల్డ్ కప్ స్క్వాడ్‌లో ఈ యంగ్‌స్టర్‌కు చోటు దక్కినా.. శుభ్‌మన్ గిల్(Shubman Gill) రాకతో బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపికైనా సిరీస్ మధ్యలోనే స్వదేశం వచ్చేశాడు.

అదేంటో గానీ ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ స్క్వాడ్‌కు సెలెక్టర్లు ఇషాన్‌ను లెక్కలోకే తీసుకోలేదు. అయినా సరే నోరుమెదపని ఇషాన్.. ధ్యానం చేస్తున్న వీడియో పోస్ట్‌తో సరిపుచ్చాడు. దాంతో, అతడు మళ్లీ జట్టులోకి ఎప్పుడు వస్తాడు? అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇదే విషయమై హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) స్పందిస్తూ… ఇషాన్ ఎప్పుడు వచ్చినా జట్టులోకి తీసుకుంటాం. కాకపోతే అతడు కొన్ని ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది అని అన్నాడు. వచ్చే నెలలో ఐపీఎల్ 17వ సీజన్ ఉన్నందున ఆ లోపు ఇషాన్ కమ్ బ్యాక్ చేస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
- Pakistan | పాక్‌లో కొనసాగుతున్న ఎన్నికల పోలింగ్.. మొబైల్ సేవలపై ఆంక్షలు
- Pooja Hegde | పాపం పూజా హెగ్డే.. అన్ని కష్టాలు కంబైన్డ్ గా దాడి చేస్తున్నాయిగా..!
- Hookah | కర్ణాటకలో హుక్కా తాగడంపై నిషేధం.. తక్షణమే అమల్లోకి
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

