Kevin O’brein | అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన కెవిన్ ఒబ్రెయిన్
ఐర్లాండ్ క్రికెట్ గురించి ప్రస్తావించగానే గుర్తొచ్చే పేరు కెవిన్ ఒబ్రెయిన్. 16 ఏళ్ల పాటు ఐర్లాండ్ జట్టులో కీలక సభ్యుడిగా వ్యవహరిస్తున్న కెవిన్.. తన సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు చెప్పాడు. నేడు (ఆగస్టు 16) ట్విటర్ వేదికగా అతడు ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించాడు. ఈ సందర్భంగా అతడు ఇన్నాళ్లు తనకు అండగా నిలిచిన కోచ్‌లు, కుటుంబసభ్యులకు కృతజ్ఞతలు తెలిపాడు.
2006 నుంచి ఐర్లాండ్ తరఫున ఆడుతున్న ఒబ్రెయిన్.. ఆ ఏడాది ఇంగ్లండ్‌తో వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. అప్పట్నుంచి ఇప్పటివరకు ఐర్లాండ్ క్రికెట్ జట్టుకు సేవలందిస్తున్నాడు. తన కెరీర్లో 153 వన్డేలు, 110 టీ20లు, 3 టెస్టులు ఆడిన అతడు ఆల్‌రౌండర్‌గా విజయవంతమైన కెరీర్‌ను ముగించాడు.
టెస్టులలో 258 పరుగులు చేసిన ఒబ్రెయిన్.. వన్డేలలో 3,619, పొట్టి ఫార్మాట్లో 1,973 పరుగులు చేశాడు. వన్డేలలో రెండు సెంచరీలు చేసిన అతడు.. టీ20లలో కూడా ఓ సెంచరీ సాధించడం గమనార్హం. బ్యాటర్ గానే బౌలర్‌గా సేవలందించిన అతడు.. వన్డేలలో 114, టీ20లలో 58 వికెట్లు పడగొట్టాడు.
వాస్తవానికి ఒబ్రెయిన్.. ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరుగబోయే టీ20 ప్రపంచకప్ తర్వాత ఆటకు గుడ్ బై చెప్దామని అనుకున్నాడు. కానీ గతేడాది దుబాయ్ వేదికగా ముగిసిన ప్రపంచకప్ తర్వాత అతడికి జట్టులో చోటు దక్కడం లేదు. సెలక్టర్లు 38 ఏళ్ల ఒబ్రెయిన్ను కావాలనే పక్కనబెడుతున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో మనస్థాపానికి గురైన అతడు.. రిటైర్మెంట్ ప్రకటించి శాశ్వతంగా ఆటకు దూరమయ్యాడు. గతేడాది ప్రపంచకప్‌లో భాగంగా నమీబియాతో ఆడిన మ్యాచ్ అతడి చివరి మ్యాచ్ అయింది.
Thanks ☘️ pic.twitter.com/E4335nE8ls
— Kevin O’Brien (@KevinOBrien113) August 16, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | గుండె పదిలంగా ఉండాలంటే వంటలో తరచూ ఈ మార్పులు చేయాల్సిందే..!
AP News | జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రేపే పోలింగ్.. సర్వం సిద్ధం చేశామన్న ఎన్నికల కమిషనర్..!
Supreme Court Bench | చెన్నైలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయండి.. ప్రధాని మోదీకి సీఎం విజయ్ లేఖ
Iran | భారత నౌకలకు హర్మూజ్‌లో ప్రత్యేక మినహాయింపు ఇచ్చిన ఇరాన్..!
Panchayat Secretaries | డోన్ట్ కేర్.. హాజరు వేసుకొని ఇంటికెళ్తున్న పంచాయతీ కార్యదర్శులు..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

