ఇంగిల్‌వుడ్: ఫిఫా వరల్డ్‌కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇరానీ ఫుట్‌బాల్ ప్లేయర్ వివాదంలో ఇరుక్కుకున్నాడు. లాస్ ఏంజిల్స్‌లోని సోఫీ స్టేడియంలో రసవత్తరంగా సాగిన మ్యాచ్ చివరకు 2-2 గోల్స్ తేడాతో డ్రా అయ్యింది. వాస్తవానికి రెండు సార్లు ఇరానీ జట్టు వెనుకబడి ఉంది. కానీ 64వ నిమిషంలో ఇరానీ ప్లేయర్ మొహమ్మద్ మోహిబి(Mohammad Mohebi) కీలకమైన రెండో గోల్స్ చేశాడు. అయితే అతను గోల్ చేసిన తర్వాత వివాదాస్పద రీతిలో గన్ సెలబ్రేషన్ చేసుకున్నాడు.
గన్ ఫైరింగ్ చేస్తున్నట్లుగా అతను గోల్ కొట్టిన ఆనందంలో సంకేతాలు ఇచ్చాడు. మిడ్‌ఫీల్డర్ మోహిబి సెలబ్రేషన్‌పై ఆన్లైన్లో విమర్శలు వస్తున్నాయి. మోహిబిపై బ్యాన్ విధించాలని కొందరు డిమాండ్ చేశారు. ఇప్పటికే ఇరాన్, అమెరికా మధ్య వార్ జరిగిన విషయం తెలిసిందే. ఆదివారమే ఆ రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం జరిగింది.
ఇక సోమవారం నాటి మ్యాచ్‌లో ఇరానీ ప్లేయర్ గన్ ఫైరింగ్ సెలబ్రేషన్ చేయడం వివాదానికి దారి తీసింది. ఇరానీ ఆటగాళ్లపై ఫిఫా కూడా కఠిన ఆంక్షలే అమలు చేస్తున్నది. అమెరికాలోని ఆరిజోనాకు బదులుగా మెక్సికోలో ఇరానీ జట్టు ప్రాక్టీస్ చేస్తున్నది. ఇరానీ జెర్సీలు వేసుకుని వచ్చిన ఫుట్‌బాల్ అభిమానులకు నిరాశ ఎదురైంది. కొందర్ని షర్ట్లు విప్పించారు. కొందరు ఆ చొక్కాను మరో వైపు ధరించారు.
Iran player Mohebi did a gun celebration on US soil 😭😭😭😭😭 pic.twitter.com/6qQ40tcbPW https://t.co/cAyGTsTxmp
— 𝐍𝐢𝐤𝐨𝐥𝐚𝐬🏖️ (@NikolasRMFC) June 16, 2026