Cameroon Green | ఐపీఎల్లో కొత్త విషయాలు చాలా నేర్చుకోవచ్చు : కామెరూన్ గ్రీన్
డిసెంబర్ 23వ తేదీన కొచ్చిలో ఐపీఎల్ 2023 వేలం మొదలుకానుంది
Cameroon Green : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడేందుకు విదేశీ ఆటగాళ్లు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ కూడా తనకు ఐపీఎల్లో ఆడాలని ఉందని అన్నాడు. అంతేకాదు ఇప్పటికే వేలంలో గ్రీన్ తన పేరు రిజిస్టర్ చేసుకున్నాడు. ‘ఐపీఎల్ వేలంలో పేరు రిజిష్టర్ చేసుకున్నా. ఐపీఎల్ అనేది నేను ఎక్కువగా ఆడని లీగ్. టాలెంట్ ఉన్న కోచ్‌లు, ఆటగాళ్లను చాలామందిని కలవొచ్చు. ఐపీఎల్ వాతావరణంలో చాలా కొత్త విషయాలు నేర్చుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నాను’ అని గ్రీన్ తన మనసులో మాట చెప్పాడు.
బిగ్‌బాష్ సీజన్ 13లో ఆల్‌రౌండర్‌గా అదరగొట్టిన గ్రీన్ రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. టెస్ట్, టీ 20ల్లో ఆరంగ్రేటం చేశాడు. టీ 20 వరల్డ్ కప్ ముందు భారత్‌తో జరిగిన టీ20ల సిరీస్‌లో కామెరూన్ గ్రీన్ అద్బుత ప్రదర్శన చేశాడు. మూడు మ్యాచ్‌లలో 241.55 స్ట్రైక్ రేట్‌తో 118 పరుగులు సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. దాంతో, ఈ ఆల్‌రౌండర్‌ను వేలంలో దక్కించుకునేందుకు ఫ్రాంఛైజీలు పోటీపడనున్నాయి. డిసెంబర్ 23వ తేదీన కొచ్చిలో ఐపీఎల్ 2023 వేలం మొదలుకానుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

