Cricket | డోపింగ్ టెస్టులో దొరకడంతో.. తనను తనే సస్పెండ్ చేసుకున్న సౌతాఫ్రికా ప్లేయర్!
కొన్నిసార్లు మనం తెలియక చేసిన పనులు కూడా పెనుభూతాలై మన తలకు చుట్టుకుంటాయి. సౌతాఫ్రికాకు చెందిన క్రికెటర్ జుబేర్ హంజా విషయంలో అదే జరిగింది. ఈ నెల 17న చేసిన డోపింగ్ టెస్టులో హంజా.. నిషేధిత పదార్థాలు తీసుకున్నట్లు తేలింది. ఈ విషయం తెలిసిన అతను తనపై తనే సస్పెన్షన్ వేసుకొని ఆటకు దూరమయ్యాడు.
అయితే అతని శరీరంలో దొరికిన పదార్థం ఫ్యూరోసెమైడ్ అని సమాచారం. ఇది ఆటగాళ్ల సత్తువ పెంచడానికి ఉపయోగించే డ్రగ్ కాదట. హైపర్ టెన్షన్, అలాగే శరీరంలో వాపులు తగ్గించడానికి ప్రిస్క్రయిబ్ చేసే మెడిసిన్. ఈ విషయంలో ఐసీసీ చేస్తున్న దర్యాప్తులో పూర్తిగా సహకరించడానికి హంజా అంగీకరించినట్లు క్రికెట్ సౌత్ఆఫ్రికా (సీఎస్ఏ) తెలిపింది.
అలాగే అతను వాలంటరీ సస్పెన్షన్‌లోకి వెళ్లినట్లు వెల్లడించింది. ఈ విషయంల సీఎస్ఏ, ఎస్‌ఏసీఏ, డబ్ల్యూపీసీఏ కూడా అతనికి మద్దతుగా ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

