IBA – IOC | అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ గుర్తింపు రద్దు.. కారణం ఏంటంటే..?
IBA - IOC : అంతర్జాతీయ బాక్సింగ్ అసోసిషేయన్(International Boxing Association)కు ఊహించని షాక్ తగిలింది. ప్రపంచవ్యాప్తంగా బాక్సింగ్ ఆటపై ఆ సంస్థ అధికారానికి తెరపడింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(International Olympic Committee) ఈరోజు ఐబీఏ గుర్తింపును రద్దు చేసింది. గురువారం సుదీర్ఘ సమయం సమావేశమైన ఐఓసీ కార్యవర్గం ఈ మేరకు...
IBA – IOC : అంతర్జాతీయ బాక్సింగ్ అసోసిషేయన్(International Boxing Association)కు ఊహించని షాక్ తగిలింది. ప్రపంచవ్యాప్తంగా బాక్సింగ్ ఆటపై ఆ సంస్థ అధికారానికి తెరపడింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(International Olympic Committee) ఈరోజు ఐబీఏ గుర్తింపును రద్దు చేసింది. గురువారం సుదీర్ఘ సమయం సమావేశమైన ఐఓసీ కార్యవర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 69 ఓట్లతో ఐబీఏ గుర్తింపునకు మంగళం పాడింది. ఇంతకు కారణం ఏంటంటే..?
పాలనా, ఆర్థిక, నైతికపరమైన అంశాల్లో సంస్కరణలను అమలు పరచడంలో ఐబీఏ విఫలమైంది. అందుకని 2019లోనే ఐఓసీ ఈ సంస్థపై సస్ఫెన్షన్ విధించింది. ఈ రోజు ఏకంగా గుర్తింపును రద్దు చేస్తున్నట్టు నిర్ణయం వెలువరించింది. అయితే.. ఐఓసీ తీర్పును ఐబీఏ తీవ్రంగా ఖండించింది. ‘ఇది నిజంగా హేయమైన చర్య. పూర్తిగా రాజకీయపరమైన నిర్ణయం’ అని తెలిపింది.
ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్
వచ్చే ఏడాది ప్యారిస్ ఒలింపిక్స్(Paris Olympics 2024)లో బాక్సింగ్ పోటీలు యథావిధిగా జరుగుతాయి. అయితే.. బౌట్స్ మాత్రం ఒలింపిక్ కమిటీ నిర్వహించనుంది. ఉక్రెయిన్(Ukraine)పై యుద్ధం కారణంగా రష్యా ఇంధన కంపెనీ గజ్ప్రోమ్(Gazprom)తో స్పాన్సర్షిప్ ఒప్పందం రద్దు కావడం ఐబీఏను మరింత కష్టాల్లో పడేసింది. రష్యా వ్యాపారవేత్త ఉమర్ క్రెమ్లెవ్(Umar Kremlev) ఐబీఏ అధ్యక్షుడిగా ఉండడంతో ఈ డీల్ క్యాన్సిల్ అయింది.
ఇవి కూడా చదవండి
HS Prannoy | తైపీ ఓపెన్‌లో ప్రణయ్ దూకుడు.. క్వార్టర్ ఫైనల్లో కాలు మోపాడు
Neeraj Chopra | నీరజ్ చోప్రా ఫిట్.. డైమండ్ లీగ్ పోటీల్లో బరిలోకి
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MCD: కాలుష్యంపై చర్చ.. ఢిల్లీ మున్సిపల్ సమావేశాల్లో గందరగోళం
‘ప్రజా వీరుడు పండుగ సాయన్న’
కాచారంలో తక్షణమే మైనింగ్ తవ్వకాలు ఆపాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
PM Modi | ఢిల్లీలో మోదీతో పోలండ్ ప్రధాని భేటీ.. ఇండియా-పోలండ్ మధ్య కీలక ఒప్పందాలు
FMG Doctors | ఎఫ్ఎంజీ వైద్యుల నిరసన.. అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

