Phil Salt : పంతొమ్మిదో సీజన్లో ప్లే ఆఫ్స్‌కు చేరువైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) కీలక బ్యాటర్ సేవల్ని కోల్పోయింది. ధనాధన్ ఆటతో శుభారంభాలు ఇచ్చే ఓపెనర్ ఫిల్ సాల్ట్(Phill Salt) అనూహ్యంగా స్వదేశానికి పయనమయ్యాడు. వరసగా మూడు మ్యాచ్‌లకు దూరమైన సాల్ట్ గాయంతో బాధ పడుతుండడమే అందుకు కారణం. మెరుగైన చికిత్స కోసం ఈ డాషింగ్ బ్యాటర్ ఇంగ్లండ్‌కు వెళ్లాడు. దాంతో.. అతడు తిరిగి ఎప్పుడు ఆర్సీబీ స్క్వాడ్‌లో కలుస్తాడు? అనేది తెలియడం లేదు.
టాపార్డ్‌లో దంచికొడుతూ ఆర్సీబీ విజయాల్లో కీలకమైన ఫిల్ సాల్ట్ ఐపీఎల్‌కు దూరమయ్యాడు. వేలి గాయంతో బాధ పడుతున్న సాల్ట్ స్వదేశం వెళ్లాడు. అక్కడ స్కానింగ్ పరీక్షలు చేయించుకొని కోలుకున్నాక తిరిగొచ్చే అవకాశముంది. ఏప్రిల్ 18న ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ అనంతరం సాల్ట్ మైదానంలోకి దిగలేదు. దాంతో.. సాల్ట్‌కు ఏమైంది? అని అభిమానులు ఆందోళన చెందారు. వారు భయపడినట్టే ఈ విధ్వంసక ప్లేయర్ సీజన్ మధ్యలోనే స్వదేశం బాట పట్టాడు.
Phil Salt has returned to the UK for scans on the finger injury that has kept him out of the last three matches for RCB
▶️ https://t.co/NJlHRs83fz pic.twitter.com/8bnNwZF4wo
— ESPNcricinfo (@ESPNcricinfo) May 4, 2026
సాల్ట్ గైర్హాజరీలో విరాట్ కోహ్లీ జతగా కుర్రాడు జాకబ్ బెథెల్(Jacob Bethell) ఇన్నింగ్స్ ఆరంభించడం ఖాయమైనట్టే. దూకుడైన ఆటతో ప్రత్యర్థి బౌలర్లను భయపెట్టే సాల్ట్ అందుబాటులో లేకపోవడంతో చురుకైన ఫీల్డర్‌ను కూడా బెంగళూరు కోల్పో్యింది. 18వ సీజన్లో ఆర్సీబీ ఛాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించిన సాల్ట్.. 19వ ఎడిషన్‌లోనూ దంచేశాడు. కేవలం ఆరు ఇన్నింగ్స్‌ల్లోనే 168.33 స్ట్రయిక్ రేటుతో 202 రన్స్ సాధించాడు. ప్రస్తుతం రెండో స్థానంలో కొనసాగుతున్న ఆర్సీబీ మే 7న లక్నో్ సూపర్ జెయింట్స్‌ను ఢీ కొట్టనుంది.
𝗝𝗮𝗰𝗼𝗯 𝗕𝗲𝘁𝗵𝗲𝗹𝗹: 𝗧𝗵𝗲 𝗷𝗼𝘂𝗿𝗻𝗲𝘆 𝗼𝗳 𝗮 𝗦𝘂𝗽𝗲𝗿𝘀𝘁𝗮𝗿. ⭐❤️
Spending 5️⃣ years at a boarding school, being called up to play for the Three Lions, being noticed by Andy Flower at the U19 World Cup, learning from Captain Rajat and Virat – who are the best in… pic.twitter.com/ZjnpecSPYN
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 4, 2026