Hockey: మోదీతో ఫోన్లో మాట్లాడుతూ ఏడ్చేసిన మహిళల హాకీ టీమ్.. వీడియో
ఎన్నో ఏళ్ల శ్రమ తర్వాత ఒలింపిక్స్‌లో మెడల్‌కు దగ్గరగా వచ్చి అది దక్కకపోతే ఎంత బాధ ఉంటుందో ఇప్పుడు ఇండియన్ వుమెన్స్ హాకీ ( Hockey ) టీమ్‌ను చూస్తే తెలుస్తుంది. అసాధారణ పోరాటంతో బ్రాంజ్ మెడల్ మ్యాచ్ వరకూ వచ్చిన టీమిండియా.. 3-4 తేడాతో బ్రిటన్ చేతిలో ఓడి మెడల్ మిస్సయింది.

టోక్యో: ఎన్నో ఏళ్ల శ్రమ తర్వాత ఒలింపిక్స్‌లో మెడల్‌కు దగ్గరగా వచ్చి అది దక్కకపోతే ఎంత బాధ ఉంటుందో ఇప్పుడు ఇండియన్ వుమెన్స్ హాకీ ( Hockey ) టీమ్‌ను చూస్తే తెలుస్తుంది. అసాధారణ పోరాటంతో బ్రాంజ్ మెడల్ మ్యాచ్ వరకూ వచ్చిన టీమిండియా.. 3-4 తేడాతో బ్రిటన్ చేతిలో ఓడి మెడల్ మిస్సయింది. అప్పటి నుంచి అమ్మాయిల టీమ్ తమ దుఃఖాన్ని ఆపుకోలేకపోతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసిన సమయంలోనూ వాళ్లు భావోద్వేగానికి గురయ్యారు. మీరు దేశానికి గర్వకారణంగా నిలిచారు. నిరాశ చెందొద్దు. ఐదారేళ్లుగా ఎంతగానో చెమటోడ్చారు. మీ కష్టం వల్లే ఇండియా మళ్లీ ఇప్పుడు విశ్వవేదికపై సత్తా చాటింది అంటూ మోదీ వాళ్లలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు.
ప్లేయర్ నవనీత కంటికి గాయమైంది కదా.. ఇప్పుడు ఆమె ఎలా ఉంది అని ఆరా తీశారు. ఆమె కంటికి నాలుగు కుట్లు పడ్డాయని కెప్టెన్ రాణి రాంపాల్ చెప్పగా.. కంటికైతే ప్రమాదం లేదు కదా అని మోదీ అడిగారు. వందన కూడా చాలా బాగా ఆడిందని ప్రశంసించారు. ఏమాత్రం నిరాశ వద్దని, మీరు దేశంలోని ఎంతో మందిలో స్ఫూర్తి నింపారని ఈ సందర్భంగా టీమ్‌ను మోదీ కొనియాడారు.
#WATCH | Indian Women's hockey team breaks down during telephonic conversation with Prime Minister Narendra Modi. He appreciates them for their performance at #Tokyo2020 pic.twitter.com/n2eWP9Omzj
— ANI (@ANI) August 6, 2021
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

