ఆసియా గేమ్స్‌కు నిఖత్ జరీన్
ప్రతిష్ఠాత్మక ఆసియా గేమ్స్‌కు భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ ఎంపికైంది. హంగ్జు(చైనా) వేదికగా సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు జరుగనున్న మెగాటోర్నీ కోసం భారత బాక్సింగ్ సమాఖ్య(బీఎఫ్ఐ) శనివారం జట్టును ప్రకటించింది.
- గాయంతో హుసాముద్దీన్ దూరం
- నీతు, అమిత్ పంగల్‌కు దక్కని చోటు
న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక ఆసియా గేమ్స్‌కు భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ ఎంపికైంది. హంగ్జు(చైనా) వేదికగా సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు జరుగనున్న మెగాటోర్నీ కోసం భారత బాక్సింగ్ సమాఖ్య(బీఎఫ్ఐ) శనివారం జట్టును ప్రకటించింది. మొత్తం 13 మంది బాక్సర్లను ఎంపిక చేయగా, ఇందులో ఆరుగురు మహిళా బాక్సర్లు ఉన్నారు. న్యూఢిల్లీ వేదికగా జరిగిన ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకంతో మెరువడం ద్వారా తెలంగాణ యువ బాక్సర్ నిఖత్జరీన్..ఆసియా గేమ్స్‌కు నేరుగా అర్హత సాధించింది. వరుసగా రెండుసార్లు ప్రపంచ బాక్సింగ్ టైటిల్ దక్కించుకున్న నిఖత్..ఆసియా గేమ్స్‌లో స్వర్ణ పతకంపై కన్నేసింది.
తద్వారా వచ్చే ఏడాది జరగనున్న పారిస్ ఒలింపిక్స్‌కు నేరుగా బెర్తు దక్కించుకునేందుకు పట్టుదలతో కనిపిస్తున్నది. మరోవైపు ఇటీవల జరిగిన ప్రపంచ బాక్సింగ్ టోర్నీలో గాయపడ్డ ఇందూరు బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ ఆసియాగేమ్స్‌కు దూరమయ్యాడు. జట్టు: నిఖత్జరీన్(51కి), ప్రీతి పవార్(54కి), పర్వీన్ హుడా(57కి), జాస్మిన్ (60కి), అరుంధతి చౌదరి(66కి), లవ్లీనా బొర్గోహై(75కి), దీపక్ బోరియా(51కి), సచిన్ సివాచ్(57కి), శివ తాపా(63.5కి), నిశాంత్‌దేవ్(71కి), లక్ష్య చాహర్(80కి), సంజీత్(92కి), నరేందర్ బెర్వాల్(+92కి)
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

