Macau Open : మకావు ఓపెన్‌లో భారత కుర్రాడు రౌనక్ చౌహన్(Rounak Chouhan) మెయిన్ డ్రాకు అర్హత సాధించాడు. పురుషుల సింగిల్స్‌లో రాణించిన రౌనక్ క్వాలిఫికేషన్ మ్యాచ్‌లో చెలరేగాడు. కానీ, అనూహ్యంగా అతడి ప్రత్యర్థి హీన్ హుటుట్(మయన్మార్) రిటైరవ్వడంతో రౌనక్ ముందంజ వేశాడు.
మకావు ఓపెన్ సూపర్ 300 టోర్నమెంట్లో రౌనత్ చౌహన్ ముందడుగు వేశాడు. మయన్మార్ షట్లర్ హీన్ హుటుట్తో తలపడిన రౌనక్ పట్టువదల్లేదు. ఇద్దరు చెరొక సెట్ గెలవడంతో మ్యాచ్ ఉత్కంఠ రేపింది. అయితే.. నిర్ణయాత్మక మూడో సెట్లో హీన్ రిటైర్డ్ అయ్యాడు. అప్పటికీ రౌనక్ స్కోర్ 19-17 ఉండడంతో అతడు మెయిన్ డ్రాకు అర్హత సాధించాడు. 32వ రౌండ్లో 133వ ర్యాంకర్ చైనీస్ తైపీకి చెందిన జే యింగ్ వూను రౌనక్ ఢీ కొట్టనున్నాడు.