T20 World Cup 2022: అత్యధిక గెలుపులతో ఆస్ట్రేలియా రికార్డును బద్దలు కొట్టిన భారత్
T20 World Cup 2022 | ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధికంగా అంతర్జాతీయ మ్యాచ్‌లు గెలిచిన జట్టుగా భారత క్రికెట్ జట్టు రికార్డు నెలకొల్పింది. సరిగ్గా 19 ఏండ్లపాటు
మెల్బోర్న్: ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధికంగా అంతర్జాతీయ మ్యాచ్‌లు గెలిచిన జట్టుగా భారత క్రికెట్ జట్టు రికార్డు నెలకొల్పింది. సరిగ్గా 19 ఏండ్లపాటు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు పేరిట ఉన్న ఆ రికార్డును ఇప్పుడు భారత్ సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా జట్టు 2003 క్యాలెండర్ ఇయర్లో మొత్తం 47 మ్యాచ్‌లు ఆడి 38 మ్యాచ్‌లలో విజయం సాధించింది. అప్పటి నుంచి 19 ఏండ్లుగా అదే రికార్డుగా ఉంది.
కానీ, ఈ ఏడాది భారత జట్టు ఆ రికార్డును బద్దలు కొట్టింది. టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం ద్వారా భారత్ ఈ రికార్డును సొంతం చేసుకుంది. నిన్నటి గెలుపు భారత జట్టుకు ఈ క్యాలెండర్ ఇయర్లో 39వ గెలుపు. దాంతో భారత్ ఈ క్యాలెండర్ ఇయర్లో ఇప్పటివరకు మొత్తం 56 మ్యాచ్‌లు ఆడి 39 విజయాలు సాధించినట్లయ్యింది.
ఈ ఏడాది ప్రారంభంలో సొంతగడ్డపై వెస్టిండీస్‌తో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు.. రెండు సిరీస్‌లలోనూ ఆ టీమ్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఆ తర్వాత సొంతగడ్డపైనే శ్రీలంక జట్టుతో మూడు టీ20 మ్యాచ్‌లు, రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఇండియన్ టీమ్.. ఆ రెండు సిరీస్‌లను కూడా వరుసగా 3-0, 2-0తో గెలుచుకుంది. అలా ఇప్పటివరకు వరుస విజయాలు సాధిస్తూ నిన్న పాకిస్థాన్‌తో 39వ విజయం నమోదు చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

