BCCI on Srilanka Tour | శ్రీలంక- టీం ఇండియా సిరీస్‌లో స్వల్ప మార్పులు!
BCCI on Srilanka Tour | త్వరలో జరిగే శ్రీలంక టూర్లో మార్పులు జరిగాయి. తొలుత టీ-20, టెస్ట్ సిరీస్ జరుగుతుందని బీసీసీఐ తెలిపింది.
BCCI on Srilanka Tour | భారత్‌లో శ్రీలంక క్రికెట్జట్టు పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. దీని ప్రకారం రెండు జట్ల మధ్య తొలుత టీ-20 సిరీస్ జరుగనున్నది. తర్వాత టెస్ట్ సిరీస్‌లో పాల్గొంటాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం తొలుత టెస్ట్ సిరీస్, అటుపై టీ-20 సిరీస్ నిర్వహించాల్సి ఉంది.రెండు జట్లు మూడు టీ-20 మ్యాచ్‌లు, రెండు టెస్ట్ మ్యాచ్‌ల్లో తల పడతాయి. ఈ నెల నాలుగోవారంలో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ ప్రారంభం అవుతుంది. నాలుగు చోట్ల మ్యాచ్‌లు జరుగుతాయి.
బెంగళూరులో రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఇది పింక్బాల్మ్యాచ్గా నిలుస్తుంది. 2019లో బంగ్లాదేశ్, 2021లో ఇంగ్లండ్‌కు వ్యతిరేకంగా పింక్ బాల్ టెస్ట్ ఆడిన తర్వాత టీంఇండియా ఆడబోతున్న మూడో పింక్ టెస్ట్ మ్యాచ్ అవుతుంది. బెంగళూరులో డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ జరుగనున్నది. సవరించిన షెడ్యూల్ ప్రకారం మూడు టీ-20 మ్యాచ్‌లు, రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో శ్రీలంక పాల్గొంటుందని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
దీని ప్రకారం ఫిబ్రవరి 24న లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి స్టేడియంలో తొలి టీ-20 మ్యాచ్, మిగతా రెండు టీ-20 మ్యాచ్‌లు 26,27 తేదీల్లో ధర్మశాలలో నిర్వహిస్తారు. ప్రస్తుతం వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ-20 సిరీస్ ముగిసిన వెంటనే శ్రీలంకతో సిరీస్ ప్రారంభం అవుతుంది.
మార్చి 4-8 మధ్య మొహలీలో తొలి టెస్ట్ మ్యాచ్, బెంగళూరులో మార్చి 12-16 మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. మొహలీలో జరిగే టెస్ట్ మ్యాచ్.. మాజీ సారధి విరాట్ కోహ్లీకి 100వ మ్యాచ్. గత నెలలో సఫారీలతో జరిగిన మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లోనే కోహ్లీ ఈ రికార్డు నమోదు చేయాల్సి ఉంది. కానీ వెన్నెముక నొప్పితో ఒక టెస్ట్ మ్యాచ్‌కు దూరమయ్యాడు.
తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 25 నుంచి మొహాలీలో తొలి టెస్ట్ మ్యాచ్, రెండో టెస్ట్ మ్యాచ్ మార్చి 5 తేదీ నుంచి జరుగాల్సి ఉంది. ఇప్పటికే ఆస్ట్రేలియాలో శ్రీలంక టీ-20 మ్యాచ్‌లు ఆడుతున్నది. ఈ నేపథ్యంలో షెడ్యూల్లో మార్పులు చేయాలని బీసీసీఐని శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) కోరింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- BCCI
- srilanka
- t-20
- Team india
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

