Junior Hockey World Cup : ప్రతిష్ఠాత్మక జూనియర్ మహిళల హాకీ వరల్డ్ కప్‌లో భారత జట్టు(India) అమెరికాపై అద్భుత విజయం సాధించింది. చిలీలోని సాంటియాగో(Santiago)లో శనివారం జరిగిన ఉత్కంఠ పోరులో అమెరికాపై 3-2తో గెలుపొందింది. దాంతో, ప్రీతి సేన పాయింట్ల పట్టికలో 9వ స్థానంతో సరిపెట్టుకుంది.
చివరి లీగ్ మ్యాచ్ కావడంతో ఇరుజట్లు హోరాహోరీగా తలపడ్డాయి. 11వ నిమిషంలో మంజూ చొర్సియా(Manju Chorsia), 57వ నిమిషంలో సునేలితా టొప్పో(Sunelita Tippo) గోల్ చేయడంతో భారత్ ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే.. అమెరికా ప్లేయర్లు కూడా రెండు గోల్స్ బాదడంతో ఒకదశలో స్కోర్లు సమం అయ్యాయి. ఉత్కంఠ నెలకొన్న సమయంలో అమెరికా జట్టు భారత గోల్‌పోస్ట్‌పై దాడికి దిగింది. కానీ, గోల్ కీపర్ మాధురి కిండో(Madhuri Kindo) చాలా నేర్పుగా గోల్‌ను అడ్డుకుంది. ఆ కాసేటికే రుతజా దడాసో పిసల్ సూపర్ గోల్‌తో భారత్‌కు విజయాన్ని అందించింది.