IND vs SL : శ్రీలంక పీకల్లోతు కష్టాల్లో పడింది. 10 ఓవర్లకే ఆరు వికెట్లు కోల్పోయింది. పేసర్ సిరాజ్ బౌలింగ్‌లో కరుణరత్నే అనూహ్యరీతిలో అవుట్ అయ్యాడు. బంతిని డిఫెండ్ చేసిన క్రీజు బయటకు వచ్చాడు. వెంటనే సిరాజ్ బంతిని వికెట్లపైకి విసిరాడు. ధర్డ్ అంపైర్ అవుట్ ఇవ్వడంతో కరుణరత్నే నిరాశగా పెవిలియన్ చేరాడు. సిరాజ్ వేసిన 10 ఓవర్ మూడో బంతికి వనిందు హసరంగ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అంతకు ముందు ఓవర్లో నవనిదు ఫెర్నాండో (19)ను సిరాజ్ బౌల్డ్ చేశాడు. కీలకమైన కుశాల్ మెండిస్ (4), ఓపెనర్ ఆవిష్క ఫెర్నాండో (1)లను పెవిలియన్‌కు పంపిన అతను లంకను ఆదిలోనే దెబ్బకొట్టాడు. మహమ్మద్ షమీ బౌలింగ్‌లో చరిత అసలంక (1) మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. అతను ఇచ్చిన క్యాచ్‌ను అక్షర్ పటేల్ పైకి ఎగిరి అందుకున్నాడు. ప్రస్తుతం కెప్టెన్ దసున్ శనక 9, వెల్లలాగె 1 రన్స్‌తో క్రీజులో ఉన్నారు. 12ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక 6 వికెట్ల నష్టానికి 46 రన్స్ చేసింది.