IND vs SL : భారీ లక్ష్య ఛేదనలో శ్రీలంకకు షాక్.. ఓపెనర్ ఆవిష్క ఫెర్నాండో (1) తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. సిరాజ్ వేసిన రెండో ఓవర్లో స్లిప్‌లో శుభ్‌మన్ గిల్ క్యాచ్ పట్టడంతో లంక మొదటి వికెట్ కోల్పోయింది. నవనిదు ఫెర్నాండో 5, కుశాల్ మెండిస్ క్రీజులో ఉన్నారు. రెండు ఓవర్లకు లంక వికెట్ నష్టానికి 7 రన్స్ చేసింది.
మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్(116), విరాట్ కోహ్లీ (155)లు సెంచరీలతో చెలరేగడంతో 390 రన్స్ చేసింది. కోహ్లీ 166 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. రోహిత్ శర్మ (42), శుభ్‌మన్ గిల్ తొలి వికెట్‌కు 95 రన్స్ జోడించారు.