ICC | ఐసీసీ కోడ్ ఉల్లంఘన.. పాకిస్థాన్ క్రికెటర్‌కు డీ మెరిట్ పాయింట్..!
ICC : పాకిస్థాన్ మహిళల జట్టు వికెట్ కీపర్ గుల్ ఫిరోజా (Gull Feroza) అంతర్జాతీయ క్రికెట్ మండలి ఆగ్రహానికి గురైంది. టీ20 ప్రపంచకప్‌లో గుల్ ఐసీసీ కోడ్ ఉల్లంఘించడమే అందుకు కారణం.
ICC : పాకిస్థాన్ మహిళల జట్టు వికెట్ కీపర్ గుల్ ఫిరోజా (Gull Feroza) అంతర్జాతీయ క్రికెట్ మండలి ఆగ్రహానికి గురైంది. టీ20 ప్రపంచకప్‌లో గుల్ ఐసీసీ కోడ్ ఉల్లంఘించడమే అందుకు కారణం. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఆమె లెవల్ 1 తప్పిదానికి పాల్పడింది. గుల్ తన నేరాన్ని అంగీకరించడంతో రిఫరీ ఆమెకు ఒక డీ మెరిట్ పాయింట్ విధించాడు.
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్న పాకిస్థాన్‌కు ఐసీసీ షాకిచ్చింది. ఆ జట్టు బ్యాటర్, వికెట్ కీపర్ గుల్ ఫిరోజాకు ఒక డీమెరిట్ పాయింట్ విధించింది. జూన్ 23 మంగళవారం ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో గుల్ ఐసీసీ నియామవళిని ఉల్లంఘించింది. పాక్ ఇన్నింగ్స్ రెండో ఓవర్లో ఔటైన తను.. డగౌట్ వద్ద బ్యాట్, చేతి గ్లోవ్స్‌ను కోపంగా విసిరేసింది.
Pakistan keeper-batter reprimanded for ICC Code of Conduct breach during the Australia game. #T20WorldCup | Read more ⬇️https://t.co/iQl3gIojXC
— ICC (@ICC) June 25, 2026
ఐసీసీ ఆర్టికల్ 2.2 ప్రకారం క్రికెట్ వస్తువులను దెబ్బతీయడం వంటివి నేరంగా పరిగణిస్తారు. గుల్ తన నేరాన్ని అంగీకరించడంతో రిఫరీ ఆమెకు ఒక డీమెరిట్ పాయింట్ కేటాయించారు. వచ్చే 24 నెలల్లో గుల్ మరోసారి ఐసీసీ కోడ్‌ను అతిక్రమిస్తే.. మరో డీ మెరిట్ పాయింట్ రానుంది. ఆసీస్ నిర్దేశించిన 200 ఛేదనలో 86కే ఆలౌటైన పాక్ 113 పరుగుల ఓటమిని మూటగట్టుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Virosh | ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముందు తిరుమలలో ప్రత్యక్షమైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. వీడియో వైరల్
Vijay | తమిళనాడు సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. దళపతిపై రౌడీ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు!
Singareni Karmika Garjana | రేపే సింగరేణి కార్మిక గర్జన.. 30 వేల మందిని సభకు సమీకరించేందుకు సన్నాహాలు
ప్రాణం తీసిన మెట్రో సీటు గొడవ.. ఢిల్లీలో మాజీ ఐఏఎస్ అధికారి అరెస్ట్
Indiramma Saree | ఇందిరమ్మ చీర.. ఇంటికి కర్టెన్!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

