గెలుపు ముంగిట హైదరాబాద్.. ఇన్నింగ్స్ ఓటమి అంచున త్రిపుర
రంజీ ట్రోఫీ తాజా సీజన్లో హైదరాబాద్ భారీ గెలుపుపై కన్నేసింది. స్థానిక జింఖానా గ్రౌండ్స్‌లో త్రిపురతో జరుగుతున్న ఎలైట్ గ్రూప్-బీ మ్యాచ్‌లో ఆ జట్టు ఇన్నింగ్స్ విజయం ముంగిట నిలిచింది.
- జడేజా ఖాతాలో మరో ఫస్ట్‌క్లాస్ సెంచరీ
- రంజీ ట్రోఫీ
హైదరాబాద్, ఆట ప్రతినిధి : రంజీ ట్రోఫీ తాజా సీజన్లో హైదరాబాద్ భారీ గెలుపుపై కన్నేసింది. స్థానిక జింఖానా గ్రౌండ్స్‌లో త్రిపురతో జరుగుతున్న ఎలైట్ గ్రూప్-బీ మ్యాచ్‌లో ఆ జట్టు ఇన్నింగ్స్ విజయం ముంగిట నిలిచింది. తొలి రోజే త్రిపురను 134 పరుగులకు ఆలౌట్ చేసిన సిరాజ్ సేన.. బ్యాటింగ్‌లో 294 రన్స్‌కు ఆలౌట్ అయి 160 పరుగుల కీలక ఆధిక్యాన్ని సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌కు వచ్చిన త్రిపుర.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి సెకండ్ ఇన్నింగ్స్‌లో 35 ఓవర్లకు 106/7 స్కోరు చేసింది. ఇన్నింగ్స్ ఓటమిని తప్పించుకోవాలంటే చేతిలో మూడు వికెట్లు మాత్రమే మిగిలున్న ఆ జట్టు ఇంకా 54 పరుగుల లోటుతో ఉంది.
ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థిని నిలువరించిన హైదరాబాద్ బౌలర్లు.. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ సత్తాచాటారు. తనయ్ త్యాగరాజన్ (3/42)తో పాటు కెప్టెన్ మహ్మద్ సిరాజ్ (2/19), రుతిక్ యాదవ్ (1/14) రాణించారు. త్రిపుర బ్యాటర్లలో సెంటూ సర్కార్ (27 బ్యాటింగ్), శ్రీదమ్ పాల్ (25) మాత్రమే 20+ స్కోర్లు చేశారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ బ్యాటర్లు రుతిక్ యాదవ్ (61), తన్మయ్ అగర్వాల్ (54) అర్ధ శతకాలకు తోడు లోయరార్డర్లో రాహుల్ రాధేశ్ (40), చామ మిలింద్ (40) రాణించడంతో ఆతిథ్య జట్టు మెరుగైన స్కోరు చేయగల్గింది.

జడ్డూ శతక జోరు
రాజ్‌కోట్‌లో ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సౌరాష్ట్ర ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (209 బంతుల్లో 102) సెంచరీ సాధించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో జడ్డూకు ఇది 16వ శతకం. రాబోయే న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌కు ముందు జడేజా సెంచరీ చేయడం విశేషం. జడ్డూకు తోడు మరో బ్యాటర్ ప్రేరక్ మన్కడ్ (129) కూడా సెంచరీ చేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్ర 392 పరుగులు చేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌కు వచ్చిన ఛత్తీస్‌గఢ్ ఆట ముగిసే సమయానికి 122/3తో ఉంది.
దేశ్‌పాండే హ్యాట్రిక్
తుషార్ దేశ్‌పాండే (5/17) నిప్పులు చెరగడంతో వాంఖెడేలో చండీగఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై జట్టు భారీ విజయం దిశగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 429 రన్స్ చేసిన ముంబై.. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థిని 78 రన్స్‌కే కుప్పకూల్చింది. 11వ ఓవర్లో తుషార్.. శివమ్, దీపేందర్, మనన్ను ఔట్ చేసి హ్యాట్రిక్ పడగొట్టాడు. ఫాలో ఆన్ ఆడుతున్న చండీగఢ్.. రెండోరోజు ఆట చివరికి పరుగులేమీ చేయకుండానే ఒక వికెట్ కోల్పోయింది. ఈ వికెట్ కూడా తుషార్ ఖాతాలోనే పడింది.

ఆంధ్రాకు ఆధిక్యం
విజయవాడ వేదికగా కర్నాటకతో జరుగుతున్న ఎలైట్ గ్రూప్-బీ పోరులో ఆంధ్రప్రదేశ్‌కు ఆధిక్యం దక్కింది. కర్నాటకను 274 రన్స్‌కే నిలువరించిన ఆంధ్రా.. రెండో రోజు బ్యాటింగ్‌కు వచ్చి 331/6 రన్స్ చేసింది. సీరమ్ వెంకట రాహుల్ (112 బ్యాటింగ్) సెంచరీ చేయగా వికెట్‌కీపర్ బ్యాటర్ రేవంత్ (97) తృటిలో శతకాన్ని కోల్పోయాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

