ఫట్రోడా: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)లో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్(హెచ్ఎఫ్సీ) మరో అద్భుత ప్రదర్శన చేసింది. గతానికి భిన్నంగామ్యాచ్ మ్యాచ్‌కు అదరగొడుతున్న హెచ్ఎఫ్సీ లీగ్‌లో టాప్‌లోకి దూసుకెళ్లింది. బుధవారం హెచ్ఎఫ్సీ, ఏటీకే మోహన్‌బగాన్ మధ్య జరిగిన మ్యాచ్ 2-2 తో డ్రాగా ముగిసింది. దీంతో ప్రస్తుతం తొమ్మిది మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు, నాలుగు డ్రాలు, ఒక ఓటమితో 16 పాయింట్లు ఖాతాలో వేసుకున్న హైదరాబాద్ లీగ్‌లో తొలిసారి అగ్రస్థానం దక్కించుకుంది. హెచ్ఎఫ్సీ తరఫున స్టార్ స్ట్రైకర్ ఓగ్బాచె(18ని), సివేరియో(90ని) గోల్స్ చేశారు. ఏటీకే జట్టులో విలియమ్స్(1ని), అశిష్ రాయ్(64ని ఓన్‌గోల్) నమోదయ్యాయి. హెచ్ఎఫ్సీ తమ తదుపరి మ్యాచ్‌లో ఈనెల 9న కేరళ బ్లాస్టర్స్‌తో తలపడుతుంది.