ఇంఫాల్: ప్రతిష్ఠాత్మక డ్యురాండ్ కప్ టోర్నీలో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్(హెచ్ఎఫ్సీ) గెలుపు జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. తమ తొలి పోరులో టీఆర్ఏయూ ఎఫ్‌సీని చిత్తు చేసిన హైదరాబాద్..మలి మ్యాచ్‌లో చెన్నైయిన్ ఎఫ్‌సీ భరతం పట్టింది. శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో హెచ్ఎఫ్సీ 3-1 తేడాతో చెన్నైయిన్పై అద్భుత విజయం సాధించింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో హెచ్ఎఫ్సీ తరఫున స్టార్ స్ట్రైకర్ ఓగ్బాచె(64ని, 74ని) డబుల్ గోల్స్‌తో అలరించగా, జావో విక్టర్(55ని) మరో గోల్ చేశాడు.