INDvsSA: ‘బాక్సింగ్ డే టెస్టు’లలో భారత్ రికార్డు ఎలా ఉంది..?
INDvsSA: దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత్.. టీ20 సిరీస్‌ను సమం చేసుకోవగా వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో గెలుచుకుంది. ఇక మరో మూడు రోజుల్లో సఫారీలతో టెస్టు సిరీస్ సవాల్‌ను ఎదుర్కోనుంది.
INDvsSA: దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత జట్టు పరిమిత ఓవర్ల క్రికెట్లో రాణించి వన్డే సిరీస్‌ను గెలుచుకుని టెస్టు సిరీస్‌కు సిద్ధమవుతోంది. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి టెస్టు డిసెంబర్ 26న సెంచూరియన్ వేదికగా జరగాల్సి ఉంది. సాధారణంగా క్రికెట్లో క్రిస్మస్కు తర్వాతి రోజున మొదలుకాబోయే (డిసెంబర్ 26న) ‘బాక్సింగ్ డే టెస్టు’లో సఫారీతో కఠిన సవాల్‌ను స్వీకరించనుంది. అసలు బాక్సింగ్ డే టెస్టులలో ఎప్పట్నుంచి పాల్గొంటున్నది..? ఇప్పటివరకూ భారత్ ఎన్ని బాక్సింగ్ డే టెస్టులలో ఆడింది..? వాటిలో ఎన్ని గెలిచి ఓన్ని ఓడింది..? వంటి వివరాలు ఇక్కడ చూద్దాం.
ఎప్పట్నుంచి..? ఎన్ని..?
ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ వంటి కామన్వెల్త్ (బ్రిటన్ సామ్రాజ్యపు కింద ఉన్న దేశాలు) దేశాలలో అత్యంత ప్రాచుర్యం పొందిన బాక్సింగ్ డే టెస్టులు ఇటీవల కాలంలో భారత్‌లో కూడా పాపులర్ అవుతున్నాయి. టీమిండియా మొట్టమొదటిసారిగా 1985లో బాక్సింగ్ డే టెస్టు ఆడింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్‌ను భారత్ డ్రా చేసుకుంది. ఇప్పటివరకూ భారత్.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ లతో 16 బాక్సింగ్ డే టెస్టులు ఆడింది. ఆస్ట్రేలియాతో 9, సౌతాఫ్రికాతో 6, న్యూజిలాండ్‌తో ఒక టెస్టు ఆడింది.
గెలిచినవి నాలుగే.. కానీ రెండు సఫారీల మీదే..
1985 నుంచి బాక్సింగ్ డే టెస్టులు ఆడుతున్న భారత్.. ఇప్పటివరకూ గెలిచింది నాలుగు మ్యాచ్‌లు మాత్రమే. అది కూడా టీమిండియా తొలి బాక్సింగ్ డే టెస్టు విజయం సౌతాఫ్రికా మీదే కావడం గమనార్హం. 2010లో సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా డర్బన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్.. సఫారీలను ఓడించి తొలి విజయాన్ని నమోదుచేసింది. కానీ 2018 నుంచి ఆడిన మూడు బాక్సింగ్ డే టెస్టులలో భారత్‌దే విజయం. 2018, 2020లలో ఆస్ట్రేలియాను ఓడించిన కోహ్లీ సేన.. 2021లో కూడా ప్రోటీస్ టీమ్‌ను ఓడించింది. త్వరలో రోహిత్ శర్మ సారథ్యంలో మ్యాచ్ ఆడనున్న టీమిండియా.. తొలి టెస్టు జరుగబోయే సెంచూరియన్‌లోనే చివరిసారిగా బాక్సింగ్ డే టెస్టును గెలుచుకుంది. మొత్తంగా సౌతాఫ్రికాపై ఆరు టెస్టు(బాక్సిండ్ డే) లు ఆడి రెండు గెలిచి నాలుగింటిలో ఓడింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కృష్ణసాగర్‌లో జన జాతీయ గౌరవ దీవస్ పక్షోత్సవాలు
RS Praveenkumar | శేరిలింగంపల్లిలో ప్రభుత్వ భూమి కబ్జా.. సాక్ష్యాధారాలతో బయటపెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
అన్నదాతపై అశనిపాతం.. కన్నీరు పెట్టిస్తున్న ‘మురసు’
Beauty tips | మీ చర్మాన్ని యవ్వనంగా మార్చే బొటాక్స్ ట్రీట్మెంట్ గురించి తెలుసా..?
Ambati Rambabu | రాజకీయ కుట్రతోనే ఈడీ నోటీసులు : మాజీ మంత్రి అంబటి రాంబాబు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

