దోహా: క్రొయేషియాతో జరిగిన క్వార్టర్స్‌లో ఓడిన బ్రెజిల్.. వరల్డ్‌కప్ నుంచి నిష్క్రమించింది. షూటౌట్లో 4-2 గోల్స్ తేడాతో క్రొయేషియా విజయం సాధించింది. టోర్నీ ఫెవరేట్‌గా బరిలోకి దిగిన బ్రెజిల్ .. క్వార్టర్స్‌లోనే ఇంటి దారి పట్టడం అందర్నీ స్టన్ చేస్తోంది. ఇక బ్రెజిల్ కీలక ఆటగాడు నేమార్ జూనియర్.. మ్యాచ్ ముగిశాక వెక్కి వెక్కి ఏడ్చాడు. మైదానంలో కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతన్ని ఓదార్చేందుకు జట్టు ఆటగాళ్లు ప్రయత్నించారు. అయినా నేమార్ మాత్రం ఏడుపును ఆపుకోలేకపోయాడు.
Million heart brokes neymar crying 💔💔 #FIFAWorldCup #Neymar pic.twitter.com/ENHlraFJJG
— Henry 🇧🇩 (@shoaibA21211051) December 9, 2022