SRH vs KKR | హెడ్ మెరిసినా.. సన్‌రైజర్స్ రెండొందలు కొట్టలే..!
SRH vs KKR : సొంతగడ్డపై భారీ స్కోర్‌తో కోల్‌కతాను భయపెట్టాలనుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ అనూహ్యంగా తడబడింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్(61) మెరుపు అర్ధ శతకతో భారీ స్కోర్‌కు పునాది వేసినా.. మిడిలాడ్డర్ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు.
SRH vs KKR : సొంతగడ్డపై భారీ స్కోర్‌తో కోల్‌కతాను భయపెట్టాలనుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ అనూహ్యంగా తడబడింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్(61) మెరుపు అర్ధ శతకతో భారీ స్కోర్‌కు పునాది వేసినా.. మిడిలాడ్డర్ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. ఇషాన్ కిషన్(42) నిలబడినా అతడికి సహకరించేవాళ్లు కరువయ్యారు. మిస్టరీ స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి(3-36), సునీల్ నరైన్(2-31)లు వికెట్ల వేటతో సన్‌రైజర్స్ హిట్లర్లకు కళ్లెం వేశారు. ఇంకేముంది.. 48 పరుగుల వ్యవధిలో 8 వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ 165కే ఆలౌటయ్యింది.
ఉప్పల్ స్టేడియంలో మొదట సన్‌రైజర్స్ బ్యాటింగ్ అనగానే పరుగుల వరద ఖాయమనుకున్న అభిమానులకు నిరాశే మిగిలింది. విధ్వంసక ఓపెనర్ అభిషేక్ శర్మ(15) త్వరగా ఔటయ్యాడు. అయినా.. ఇషాన్ కిషన్(42) జతగా ట్రావిస్ హెడ్(61) రెచ్చిపోయాడు. హెడ్ దూకుడుతో పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 71 రన్స్ చేసిన హైదరాబాద్ భారీ స్కోర్ కొడుతుందనిపించింది. కానీ, అర్ధ శతకంతో గుబులు రేపిన హెడ్‌ను వరుణ్ చక్రవర్తి(3-36) ఔట్ చేయడంతో కోల్‌కతా బౌలర్లు పుంజుకున్నారు.
One sails into the stands 🚀
The other into the fielder’s hands 🫴🎥 Varun Chakaravarthy wins the mini-battle against Travis Head 👏
Updates ▶️ https://t.co/muersQO7at#TATAIPL | #KhelBindaas | #SRHvKKR | @KKRiders pic.twitter.com/vSCn96yfgt
— IndianPremierLeague (@IPL) May 3, 2026
ఇలా వచ్చి అలా..
గ్రీన్ ఓవర్లో వరసగా 6, 4 బాదిన క్లాసెన్ షార్ట్ బంతిని మిడ్వికెట్లో ఆడగా. పావెల్ ఒంటిచేత్తో డైవింగ్ క్యాచ్ అందుకున్నాడు. తర్వాతి ఓవర్లోనే స్మరణ్ రవిచంద్ర(4)ను వరుణ్ వెనక్కి పంపాడు. వెంట వెంటనే రెండు వికెట్లు పడడంతో ఇషాన్, అనికేత్ వర్మ(6)లు ఇన్నింగ్స్ నిర్మించాలనుకున్నారు. కానీ, వరుణ్ ఓవర్లో అనికేత్ పెద్ద షాట్ ఆడి రహనేకు దొరికాడు. అంతే.. ఉన్నపళంగా సన్‌రైజర్స్ స్కోర్ వేగం తగ్గిపోయింది.
A special delivery to reach a special milestone 🤌
🎥 Sunil Narine picks his 200th #TATAIPL wicket with an unplayable delivery 🫡
Updates ▶️ https://t.co/muersQO7at#KhelBindaas | #SRHvKKR | @KKRiders pic.twitter.com/HTud7IBAq4
— IndianPremierLeague (@IPL) May 3, 2026
నరైన్(2-31) ఒకే ఓవర్లో సలీల్ అరోరా, ఇషాన్‌లను ఔట్ చేసి భారీ స్కోర్ ఆశలపై నీళ్లు చల్లాడు. కమిన్స్(10) సిక్సర్‌తో అలరించినా తర్వాతి బంతికే అనకుల్ రాయ్‌కు రిటర్న్ క్యాచ్ ఇచ్చేశాడు. హర్షల్ పటేల్(6) చివరి వికెట్‌గా వెనుదిరగగా.. 19 ఓవర్లలో హైదరాబాద్ 165కే పరిమితమైంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

