Ashes Series | చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన బ్రూక్.. యాషెస్‌లో బోణీ కొట్టిన ఇంగ్లండ్
Ashes Series : ఇంగ్లండ్(England) జట్టు ఎట్టకేలకు యాషెస్(Ashes Series)లో బోణీ కొట్టింది. రెండో టెస్టులో చివరి దాకా పోరాడి భంగపడిని ఆతిథ్య జట్టు ఈసారి విజయాన్ని ఒడిసి పట్టుకుంది. ఉత్కంఠ రేపిన మూడో టెస్టు(Third Test)లో 3 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా(Australia)పై అద్భుత విజయం సాధించింది. యువ ఆటగాడు హ్యారీ బ్రూక్(75) చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో జట్టును....
Ashes Series : ఇంగ్లండ్(England) జట్టు ఎట్టకేలకు యాషెస్(Ashes Series)లో బోణీ కొట్టింది. రెండో టెస్టులో చివరి దాకా పోరాడి భంగపడిని ఆతిథ్య జట్టు ఈసారి విజయాన్ని ఒడిసి పట్టుకుంది. ఉత్కంఠ రేపిన మూడో టెస్టు(Third Test)లో 3 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా(Australia)పై అద్భుత విజయం సాధించింది. యువ ఆటగాడు హ్యారీ బ్రూక్(75) చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు.
బ్రూక్ ఔటయ్యాక క్రిస్ వోక్స్(32 నాటౌట్), మార్క్ వుడ్(16 నాటౌట్), మరో వికెట్ పడకుండా ఆడి జట్టును గెలిపించారు. దాంతో, ఇంగ్లండ్ 1-2తో సిరీస్‌లో నిలిచింది. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో సత్తా చాటిన మార్క్ వుడ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడు. ఈ విజయంతో ఆస్ట్రేలియా చేతిలో వరుసగా 7 ఓటములకు ఇంగ్లండ్ ముగింపు పలికింది.
బ్రూక్ సాధికారిక ఇన్నింగ్స్
ఇంగ్లండ్ విధ్వంసక ఆటగాడు హ్యారీ బ్రూక్(Harry Brook) మూడో టెస్టులో సాధికారిక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. 251 లక్ష్య ఛేదనలో నాలుగో రోజు తొలి సెషన్లోనే ఇంగ్లండ్ 4 వికెట్లు కోల్పోయింది. అయితే.. క్రీజులో పాతుకుపోయిన బ్రూక్.. జో రూట్(21), బెన్ స్టోక్స్(13), జానీ బెయిర్ స్టో(5)తో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఒత్తిడిలోనూ బౌండరీలతో చెలరేగుతూ అర్ధ సెంచరీ సాధించాడు.
హ్యారీ బ్రూక్(75)

వేగంగా వెయ్యి పరుగులు
ఈ మ్యాచ్‌తో 24 ఏళ్ల బ్రూక్ టెస్టుల్లో సంచలనం సృష్టించాడు. ఈ ఫార్మాట్లో తక్కువ బంతుల్లో వేగంగా వెయ్యి పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. బ్రూక్ 1058 బంతుల్లోనే ఈ ఘనత సొంతం చేసుకోవడం విశేషం. పదో టెస్టు ఆడుతున్న బ్రూక్ 16వ ఇన్నింగ్స్‌లో 1000 పరుగుల మైలురాయికి చేరుకున్నాడు. అయితే.. మ్యాచ్‌ల పరంగా చూస్తే ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్(Don Bradman) వేగంగా వెయ్యి పరుగులు బాదాడు. అతను 7 టెస్టుల్లోనే వెయ్యి క్లబ్లో చేరాడు.
ఇవి కూడా చదవండి
Wimbledon 2023 | మిక్స్డ్ డబుల్స్‌లో బోపన్న జోడికి చుక్కెదురు
Westindies Tour | వెస్టిండీస్‌తో వన్డే సిరీస్.. ఈ ముగ్గురి సత్తాకు పెద్ద పరీక్ష..!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

